E-Paper
Advertisement

Hackers: యూనివర్సిటీ కంప్యూటర్లను హ్యాక్.. లక్షల డాలర్లు డిమాండ్..

Hackers: యూనివర్సిటీ కంప్యూటర్లను హ్యాక్.. లక్షల డాలర్లు డిమాండ్..
Advertisement

Hackers: హ్యాకింగ్ అనేది ఈరోజుల్లో విపరీతంగా పెరిగిపోతోంది. టెక్నికల్ అనుభవం లేని వారు కూడా హ్యాకింగ్‌ను నేర్చుకుంటున్నారు. ఇక టెక్నికల్ ఫీల్డ్‌పై అవగాహన ఉన్నవారు హ్యాకింగ్‌లో నిపుణులు అయిపోతున్నారు. ఈ హ్యాకింగ్ వల్ల ప్రభుత్వాలు కూడా చిక్కుల్లో పడే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. తాజాగా ఇజ్రాయెల్‌పై హ్యాకర్ల కన్నుపడింది. హ్యాక్ చేయడంతో పాటు ఆ సమాచారం బయటికి రాకుండా ఉండడానికి వారు భారీ మొత్తాన్ని డిమాండ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది.

హైఫాలోని ఇజ్రాయెల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సైబర్ అటాక్‌కు గురయ్యిందని తాజాగా బయటపెట్టింది. టెక్నియన్‌గా పిలవబడే ఈ ఇన్‌స్టిట్యూట్ వెబ్సైట్ నుండి అందరూ లాగ్ ఆఫ్ అవ్వాలని తెలియని యూజర్ నుండి విద్యార్థులకు సమాచారం అందింది. ఉన్నట్టుండి టెక్నియన్ నుండి లాగ్ ఆఫ్ అవ్వాలని మెసేజ్ వచ్చిందని, అందుకే తామంతా లాగ్ ఆఫ్ అయ్యామని, పరీక్షలు దగ్గర పడుతున్న సమయంలో ఇలా జరగడం బాధాకరం అని విద్యార్థులు వాపోతున్నారు.

Advertisement

డార్క్ బిట్ అనే గ్రూప్ ద్వారా ఇన్‌స్టిట్యూట్ సైబర్ అటాక్‌కు గురయ్యిందని ఒక న్యూస్ సైట్ వెల్లడించింది. అంతే కాకుండా హ్యాకర్లు టెక్నియన్ నుండి 80 బిట్‌కాయిన్స్ డిమాండ్ చేసినట్టుగా తెలుస్తోంది. అంటే దాని విలువ దాదాపు 1,747,971 డాలర్లు. ప్రతీ ఏడాది వేలమంది ఇంజనీర్లను తయారు చేసి వివిధ రంగాల్లో వారికి ఉద్యోగ అవకాశాలు ఇచ్చే ఇజ్రాయిల్ ఇన్‌స్టిట్యూట్ వల్ల ఇలా జరగడంతో యాజమాన్యం.. విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు క్షమాపణలు తెలిపారు.

టెక్నియన్ హ్యాక్ అయ్యిందని, జాతులలో తేడాలు చూపించడం వల్లే హ్యాకర్లు ఇలా చేశారని యాజమాన్యం తన తప్పును బహిరంగంగా ఒప్పుకుంది. ప్రస్తుతం ఇన్‌స్టిట్యూట్‌లో ఏ సిస్టమ్ కూడా ఉపయోగించడానికి సహకరించడం లేదని, దాంతో పాటు వాటి నుండి ఎంతో సమాచారం దొంగలించబడిందని వారు తెలిపారు. తమపై నమ్మకం పెట్టుకున్న వారందరికీ క్షమాపణలు తెలిపారు. మరోవైపు సైబర్ టీమ్ కూడా ఈ విషయంపై విచారణ చేపట్టింది.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×