E-Paper
Advertisement

Guava Leaf Benefits : పేదవాడి యాపిల్‌ ప్రయోజనాలివే

Guava Leaf Benefits : పేదవాడి యాపిల్‌ ప్రయోజనాలివే
Advertisement

Guava Leaf Benefits : జామ.. దీన్ని పేదవాడి యాపిల్ అని పిలుస్తారు. జామకాయల వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అంతేకాకుండా జామ ఆకుల్ని తినడం వల్ల కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. జామ ఆకులు డయాబెటిస్‌ను అదుపులో ఉంచుతాయి. జామ ఆకులతో తయారు చేసిన టీని తాగితే షుగర్ లెవెల్స్ తగ్గినట్లు అధ్యయనాల్లో తేలింది. అందుకే జామ ఆకులను టీ తయారు చేసుకుంటే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. జామ ఆకుల్ని తిన్నా, వీటితో తయారుచేసిన టీ తాగినా శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. మంచి కొలెస్ట్రాల్ స్థాయి పెరుగుతుంది. ఇది శాస్త్రీయంగా కూడా నిరూపితమైంది. ఈ జామ ఆకుల వల్ల గుండె ఆరోగ్యం పదిలంగా ఉంటుంది. గుండె జబ్బులు రాకుండా అడ్డుకుంటుంది. మహిళలు రుతు సమయంలో జామ ఆకులను తీసుకోవడం వల్ల వారికి తీవ్రమైన నొప్పి సమస్య తగ్గుతుందని నిపుణులు అంటున్నారు. జామ ఆకులను నిత్యం ఆరు మిల్లీగ్రాముల మోతాదులో తీసుకుంటే రుతు సమయంలో స్త్రీలకు ఎంతో ఉపశమనం కలుగుతుంది. జామ ఆకుల్లో ఉండే పోషకాలు మన జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తాయి. ఇందులో యాంటీ మైక్రోబియల్ గుణాలు డయేరియా నుంచి కూడా బయట పడేస్తాయి. విరోచనాలు అవుతున్నవారు జామ ఆకులను తింటే మంచి ప్రయోజనం ఉంటుంది. జామ ఆకుల్లో ఉండే యాంటీ క్యాన్సర్ గుణాలు క్యాన్సర్లను అడ్డుకుంటాయి. అలాగే శక్తివంతమైన ఆంటీ యాక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్‌ను నాశనం చేస్తాయి. దీంతో వ్యాధుల బారిన పడకుండా మనల్ని కాపాడుతాయి. జామ ఆకుల్లో కూడా విటమిన్ సి ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. జలుబు, దగ్గు లాంటి వైరల్ ఇన్ఫెక్షన్స్ నుంచి మనల్ని కాపాడుతుంది. జామ ఆకుల పేస్ట్‌ను చర్మంపై రాసుకుంటే చర్మ సమస్యలు పోతాయి. అంతేకాకుండా మన చర్మం కాంతివంతంగా మారుతుంది. మొటిమలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×