E-Paper
Advertisement

Clarity From Whatsapp : ఎందుకు ఆగింది? వాట్సప్ వివరణ కోరిన భారత్..

Clarity From Whatsapp : ఎందుకు ఆగింది? వాట్సప్ వివరణ కోరిన భారత్..
Advertisement

Clarity From Whatsapp : మంగళవారం వాట్సప్ సేవలు గంటన్నరకు పైగా నిలిచిపోవడంపై.. భారత ప్రభుత్వం ఆ సంస్థను వివరణ కోరింది. సేవల్లో ఎందుకు అంతరాయం ఏర్పడిందో కారణాలు చెప్పాలని వాట్సప్ కు సూచించింది. సాంకేతిక సమస్యల వల్ల అంతరాయం ఏర్పడిందా? సైబర్‌ ఎటాక్‌ ఏమైనా జరిగిందా? అన్న వివరాలు చెప్పాలంటూ… వాట్సప్‌ నుంచి ఎలక్ట్రానిక్స్‌, ఐటీ మంత్రిత్వ శాఖ వివరణ కోరింది. భారత్‌కు చెందిన కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీమ్‌ తో సమన్వయం చేసుకుంటూ… సేవల్లో అంతరాయానికి గల కారణాలను కనిపెట్టాలని వాట్సప్ కు సూచించింది. వారంలోగా నివేదిక సమర్పించాలని వాట్సప్ ను ఆదేశించింది…. ఎలక్ట్రానిక్స్‌, ఐటీ మంత్రిత్వ శాఖ.

గత మంగళవారం భారత్ సహా అనేక దేశాల్లో వాట్సప్ సేవలు నిలిచిపోయాయి. వాట్సప్‌లో పంపిన మెసేజ్‌ల డెలివరీ స్టేటస్‌ చూపించకపోవడంతో పాటు… డబుల్‌ టిక్‌, బ్లూ టిక్‌ మార్కులు కనిపించలేదు. దీంతో మెసేజ్‌ వెళ్లిందా? లేదా? అని యూజర్లు గందరగోళానికి గురయ్యారు. సమస్యను గుర్తించిన వెంటనే వేల మంది యూజర్లు వెబ్‌సైట్‌లో ఫిర్యాదులు చేశారు. మెసేజ్‌లు పంపడంలో సమస్యలు ఎదుర్కొన్నామని కొందరు… సర్వర్ సంబంధిత సమస్యలు ఉన్నాయని మరికొందరు… బ్లూ టిక్‌ కనిపించడం లేదని ఇంకొందరు ఫిర్యాదుల్లో రాసుకొచ్చారు. సుమారు గంటన్నర తర్వాత సమస్య పరిష్కారమైంది. ఇంతకుముందు కూడా వాట్సాప్‌ సేవల్లో చాలాసార్లు అంతరాయం ఏర్పడినా… ఈ స్థాయిలో సమస్య తలెత్తడం ఇదే తొలిసారి. యూజర్లకు కలిగిన అసౌకర్యానికి వాట్సప్‌ క్షమాపణ చెప్పినా… అంతరాయానికి కారణాలను మాత్రం వెల్లడించలేదు. దాంతో… వల్లో అంతరాయానికి కారణాలేంటో చెప్పాలని వాట్సప్‌ను ఆదేశించింది… ఎలక్ట్రానిక్స్‌, ఐటీ మంత్రిత్వ శాఖ.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×