E-Paper
Advertisement

Google Adds Music:మెసేజ్ చేస్తే మ్యూజిక్కే.. గూగుల్ కొత్త అప్డేట్..

Google Adds Music:మెసేజ్ చేస్తే మ్యూజిక్కే.. గూగుల్ కొత్త అప్డేట్..
Advertisement

Google Adds Music:కృత్రిమ మేధస్సు (ఏఐ) ఇప్పుడు అన్ని రంగాల్లో కీలకంగా మారింది. తాజాగా యాప్స్‌లో కూడా ఎన్నో మార్పులు చేయడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను ఉపయోగిస్తున్నారు. కేవలం సైన్స్‌లోనే కాదు టెక్నాలజీ వరల్డ్‌లో కూడా ఏఐకు భారీగా ప్రాధాన్యత రానుంది. దానికి ఉదాహరణే గూగుల్ తయారు చేసిన కొత్త అప్డేట్. ఏఐ సాయంతో గూగుల్ ఓ కొత్త అప్డేట్‌ను మార్కెట్‌లోకి తీసుకురానుంది.

ఫోన్లలో చాటింగ్ చేసుకోవడానికి ఎన్నో సోషల్ మీడియా యాప్స్ ఉన్నాయి. కేవలం చాటింగ్‌కు సంబంధించి ఈ యాప్స్ అన్ని ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటాయి. మెసేజ్‌లకు ఎమోజీలతో రియాక్ట్ అవ్వడం, మెసేజ్‌లను గిఫ్ట్ రూపంలో పంపడం ఇలా చాలా అప్డేట్స్ ప్రస్తుతం సోషల్ మీడియా యాప్స్‌లో అందుబాటులో ఉన్నాయి. గూగుల్ వాటికి మరింత అందాన్ని యాడ్ చేయనున్నట్టుగా తెలుస్తోంది.

Advertisement

ఒకటికి మెసేజ్ చేసేటప్పుడు మ్యూజిక్ కూడా వచ్చేలా గూగుల్.. ఓ కొత్త అప్డేట్‌ను తయారు చేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఈ అప్డేట్‌ను తయారు చేసింది గూగుల్. అంతే కాకుండా ఓ సంగీత పరికరంతో ఉన్న మ్యూజిక్‌ను మరో సంగీత పరికరంతో వస్తున్నట్టుగా ఫీచర్‌ను కూడా గూగుల్ ఈ అప్డేట్‌లో చేర్చింది. ఇప్పటికే పలు టెక్నికల్ సిస్టమ్స్‌లో ఇలాంటి ఫీచర్ ఉండగా.. ఇప్పుడు గూగుల్ కూడా తన ఫీచర్స్‌లో ఈ అప్డేట్‌ను యాడ్ చేయనుంది.

ఈ అప్డేట్‌కు మ్యూజిక్‌ఎల్ఎమ్ అని పేరు కూడా పెట్టారు. ఈ ఫీచర్ టెస్టింగ్ స్టేజ్‌లో ఎన్నో శాంపిల్స్‌ను తయారు చేసి సక్సెస్ అయ్యింది గూగుల్. ఇవన్నీ చాలా బాగా వచ్చాయని నిపుణులు చెప్తున్నారు. చాలావరకు మెలోడీ మ్యూజిక్‌నే ఇందులో ఉపయోగించినట్టుగా తెలుస్తోంది. మ్యూజిక్‌ఎల్ఎమ్ ద్వారా కేవలం మ్యూజిక్ మాత్రమే కాదు.. మనుషుల గొంతు కూడా వినిపిస్తుందని గూగుల్ తెలిపింది. ఫీచర్ టెస్టింగ్ సక్సెస్ అయినా కూడా ఇది మన స్మార్ట్ ఫోన్లలోకి ఎప్పుడు వస్తుందో బయటపెట్టలేదు గూగుల్.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×