E-Paper
Advertisement

Gautam Adani : అదానీని తక్కువ అంచనా వేశారు.. ఇప్పుడు చూడండి ఎలా మారిందో..!

Gautam Adani : అదానీని తక్కువ అంచనా వేశారు.. ఇప్పుడు చూడండి ఎలా మారిందో..!
Advertisement
Gautam Adani

Gautam Adani : అదానీ గ్రూప్ షేర్లు మళ్లీ దూసుకెళ్తున్నాయి. హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్ రిపోర్ట్ ఇచ్చిన తరువాత.. కొన్ని రోజుల పాటు దారుణ పతనాన్ని చూశాయి అదానీ షేర్లు. ఒక విధంగా షార్ట్ గ్యాప్‌తో మళ్లీ కోలుకున్నాయి. ఇప్పుడు వరుస లాభాలతో పరుగులు తీస్తున్నాయి. అయితే, అదానీ గ్రూప్ షేర్లలో ప్రమాదం పూర్తిగా తొలగిపోలేదన్నది మార్కెట్ ఎక్స్‌పర్ట్స్ అభిప్రాయం. ట్రేడింగ్ చేసే వాళ్లు ఆచితూచి ఇన్వెస్ట్ చేసినా ఫర్వాలేదు గానీ.. పోర్ట్ ఫోలియోలో లాంగ్ టర్మ్ కోసం పెట్టాలనుకుంటే మాత్రం కాస్త ఆలోచించాలని చెబుతున్నారు. డొమెస్టిక్ ఇన్‌స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ కూడా అదానీ గ్రూప్ షేర్ల విషయంలో జాగ్రత్త పడుతున్నారు. చాలా తక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు.

కాని.. ఎల్ఐసీ మాత్రం అదానీ గ్రూప్ షేర్లలో ఫుల్ భరోసాతో ఉంది. అదానీ గ్రూప్‌లో పెట్టుబడులు పెట్టించి, ఎల్ఐసీ కంపెనీని నాశనం చేస్తున్నారని ఎవరెన్ని ఆరోపించినా… ఎల్ఐసీ మాత్రం అదానీ గ్రూప్ షేర్లపై నమ్మకం ఉంచింది. అందుకే, హిండెన్ బర్గ్ రిపోర్ట్ ఇచ్చినా, అన్ని నష్టాలు వచ్చినా.. ఇప్పటికీ అదానీ షేర్లలో పెట్టుబడులు పెడుతూనే ఉంది ఎల్ఐసీ.

Advertisement

మార్చితో ముగిసిన క్వార్టర్‌కు.. మ్యూచువల్‌ ఫండ్స్‌ సహా కొందరు బడా ఇన్వెస్టర్లు అదానీ గ్రూప్‌ షేర్లను వదిలించుకుంటే.. ఎల్‌ఐసీ మాత్రం తన వాటా పెంచుకుంది.
ముఖ్యంగా అదానీ ఎంటర్‌ప్రైజెస్‌లో తన వాటాను 4.26 శాతానికి పెంచుకుంది ఎల్‌ఐసీ. లాస్ట్ క్వార్టర్‌లో ఎల్ఐసీకి ఉన్న వాటా 4.23 శాతం. ఇక అదానీ గ్రీన్ఎనర్జీలో తన ఇన్వెస్ట్‌మెంట్‌ను 1.36 శాతానికి పెంచుకుంది ఎల్‌ఐసీ. అదానీ టోటల్‌ గ్యాస్‌లోనూ ఎల్‌ఐసీ వాటా 5.96 శాతం వాటా 6.02శాతానికి చేరింది. అదానీ ట్రాన్స్‌మిషన్‌లో తన వాటాను 3.68 శాతానికి పెంచుకుంది. అయితే, అదానీ గ్రూప్‌ కంపెనీ అయిన అంబుజా సిమెంట్స్‌లో మాత్రం వాటాను 6.33 శాతం నుంచి 6.30 శాతానికి తగ్గించుకుంది. అదానీ పోర్ట్స్ అండ్‌ స్పెషల్ ఎకనామిక్ జోన్‌లోనూ 9.14 శాతంగా ఉన్న వాటాను 9.12 శాతానికి తగ్గించుకుంది.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×