E-Paper
Advertisement

Rahul Gandhi on Adani: అదానీ దేశసంప‌ద కొల్ల‌గొట్టాడు.. ఆయ‌న వెన‌కుంది మోడీనే: రాహుల్ గాంధీ

Rahul Gandhi on Adani: అదానీ దేశసంప‌ద కొల్ల‌గొట్టాడు.. ఆయ‌న వెన‌కుంది మోడీనే: రాహుల్ గాంధీ
Advertisement

Rahul Gandhi on Adani: అదానీని ప్ర‌ధాని మోడీనే కాపాడుతున్నాడ‌ని కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ గాంధీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అమెరికా భార‌త్ చ‌ట్టాల‌ను అదానీ ఉల్లంగించార‌నే విష‌యంపై ఇప్పుడు స్ప‌ష్టత వ‌చ్చింద‌ని అన్నారు. మోడీ అదానీల బంధం భార‌త్ లో ఉన్నంత‌వ‌ర‌కే సుర‌క్షితమ‌ని వ్యాఖ్యానించారు. లంచం ఆరోప‌ణ‌ల‌పై అదానీపై కేసు న‌మోదు కాగా వెంట‌నే ఆయ‌న్ను అరెస్ట్ చేయాల‌ని డిమాండ్ చేశారు. అమెరికాలోనూ అదానీ అక్ర‌మాల‌కు పాల్ప‌డ్డార‌ని ఆరోపించారు.

Also read: నేడు, రేపు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు.. ఈ ప్రాంతాల నుంచి వెళ్లకపోవడమే మంచిది..

Advertisement

అదానీ ఇంత స్వేచ్ఛ‌గా ఎలా బ‌య‌ట తిరుగుతున్నార‌ని రాహుల్ ప్రశ్నించారు. ఆయ‌న రూ.2వేల కోట్ల కుంభ‌కోణానికి పాల్ప‌డ్డార‌ని చెప్పారు. అదానీని ఎందుకు అరెస్ట్ చేయ‌డం లేదో మోడీ చెప్పాల‌ని అన్నారు. అదానీ ఏం చేశారో తాము దేశ ప్ర‌జ‌ల‌కు చెప్ప‌గ‌లిగామ‌ని వ్యాఖ్యానించారు. తాజాగా అదానీపై వ‌స్తున్న ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో త‌క్ష‌ణ‌మే జేపీసీతో విచార‌ణ జ‌రిపించాల‌ని రాహుల్ అభిప్రాయ‌ప‌డ్డారు.

శీతాకాల స‌మావేశాల‌లో ఈ అంశాన్ని లేవ‌నెత్తుతామ‌ని చెప్పారు. త‌న అవినీతి ద్వారా అదానీ దేశ సంప‌ద‌నంతా కొల్ల‌గొట్టార‌ని ఆరోపించారు. అదానీని ర‌క్షిస్తే సెబీ చీఫ్ ను ఆ ప‌ద‌వి నుండి తొల‌గించి ఆమెపై కూడా విచార‌ణ జ‌రిపించాల‌ని చెప్పారు. లంచం ఆరోప‌ణ‌లు ఎదురుకుంటున్న రాష్ట్రాల్లో ఏ పార్టీ అధికారంలో ఉన్నా విచార‌ణ జ‌రింపించాల‌ని రాహుల్ డిమాండ్ చేశారు. అదానీ అరెస్ట్ కాడ‌ని.. ఆయ‌న‌ను అరెస్ట్ చేయ‌ర‌ని, ఎందుకంటే ఆయ‌న వెన‌క మోడీ ఉన్నార‌ని రాహుల్ గాంధీ ఆరోపించారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×