E-Paper
Advertisement

Gas Free Kitchen: గ్యాస్ లేకుండా వంట చేయడం ఎలా? ఇదేమి కష్టం కాదండోయ్.. చాలా ఈజీగా చేసేయోచ్చు!

Gas Free Kitchen: గ్యాస్ లేకుండా వంట చేయడం ఎలా? ఇదేమి కష్టం కాదండోయ్.. చాలా ఈజీగా చేసేయోచ్చు!
Advertisement

Gas Free Kitchen: గల్ఫ్ దేశాల్లో నెలకొన్న యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో దేశంలో గ్యాస్ కష్టాలు మెుదలయ్యాయి. ముఖ్యంగా ఎల్ పీజీ సిలిండర్ల సరఫరాలో పెద్ద ఎత్తున జాప్యం ఏర్పడుతున్నట్లు సామాన్యులు చెబుతున్నాయి. ప్రస్తుతం నెలకొన్న ఆందోళనల నేపథ్యంలో ప్రస్తుతం చాలా మంది ‘గ్యాస్-ఫ్రీ’ (Gas-free) వంటగది వైపు మెుగ్గు చూపుతున్నారు. కాబట్టి మీ వంటగదికి గ్యాస్ అవసరం లేకుండా చేసే కుకింగ్ పరికరాలు.. ముఖ్యమైన చిట్కాలు ఏంటో ఈ కథనంలో పరిశీలిద్దాం.

ఇండక్షన్ కుక్‌టాప్స్

ప్రస్తుతం ఎల్‌పీజీకి అత్యంత ముఖ్యమైన ప్రత్యామ్నాయంగా ఇండక్షన్ స్టవ్స్ లేదా కుక్ టాప్స్ నిలుస్తున్నాయి. ఇవి విద్యుత్ శక్తిని ఉపయోగించి నేరుగా పాత్రను వేడి చేస్తాయి. గ్యాస్ మీద కంటే వేగంగా వంట పూర్తిచేసేందుకు ఇవి సహాయపడతాయి.

పైప్డ్ నేచురల్ గ్యాస్ (PNG)

Advertisement

ప్రస్తుతం నెలకొన్న సిలిండర్ బుకింగ్, డెలివరీ టెన్షన్ నుంచి విముక్తి పొందాలని భావిస్తే.. PNG బెస్ట్ ఛాయిస్ గా చెప్పవచ్చు. ఇది నేరుగా పైపుల ద్వారా గ్యాస్ సరఫరా చేస్తుంది. కాబట్టి సిలిండర్ అయిపోతుందనే భయం ఉండదు. మీరు వాడిన గ్యాస్ రీడింగ్ బట్టి బిల్లు చెల్లిస్తే సరిపోతుంది.

సోలార్ కుక్కర్స్

పర్యావరణ హితంగా, ఖర్చు లేకుండా వంట చేయాలనుకునే వారికి ఇది సరైన ఎంపికగా నిలుస్తోంది. ఇది సూర్యరశ్మిని ఉపయోగించి ఆహారాన్ని ఉడికిస్తుంది. ఒకప్పుడు పగటిపూట, ఎండ ఉన్నప్పుడు మాత్రమే వీటి ద్వారా వంట చేసుకోవడం సాధ్యమయ్యేది. కానీ ఇప్పుడు లభిస్తున్న అధునాతన సోలార్ ప్యానెల్ సిస్టమ్స్ ద్వారా విద్యుత్ నిల్వ చేసుకుని కూడా వాడుకోవచ్చు.

ఎలక్ట్రిక్ అప్లయన్సెస్

Advertisement

గ్యాస్‌తో సంబంధం లేకుండా వంటగదిలో పనులు చెక్కబెట్టడానికి మరికొన్ని ఎలక్ట్రానిక్ పరికరాలు సైతం మార్కెట్ లో లభిస్తున్నాయి. ఎయిర్ ఫ్రైయర్స్ నూనె లేకుండా ఆహారపదార్థాలను వేయించడానికి, బేకింగ్‌కు ఉపయోగపడతాయి. ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్స్.. అన్నం వండటానికి గ్యాస్ అవసరాన్ని తగ్గిస్తాయి. మైక్రోవేవ్ ఓవెన్స్.. ఆహారాన్ని వేడి చేయడానికి, కొన్ని రకాల వంటకాలకు అనువుగా ఉంటాయి.

Also Read: AI Robot Soldier: తుపాకీ 100 శాతం గురిపెట్టే రోబో లాంచ్.. యుద్ధంలో శత్రు సైన్యానికి వేటాడే వార్ మెషీన్

గ్యాస్-ఫ్రీ కిచెన్‌ చిట్కాలు..

వంటగదిలో ఎల్పీజీకి బదులు ఇండక్షన్ వాడుతున్నట్లయితే దానికి సరిపోయే (Induction compatible) పాత్రలను కొనుగోలు చేయండి. కిచెన్ లో హై-వోల్టేజ్ సాకెట్లు మరియు పవర్ బ్యాకప్ ఉండేలా చూసుకోండి. అయితే ప్రారంభంలోనే పూర్తిగా గ్యాస్ తీసేయకుండా ఇండక్షన్, గ్యాస్ రెండింటినీ కలిపి వాడుతూ మెల్లగా మారడం ఉత్తమం.

Also Read: Relationship Secrets: ప్రేమలో ఉన్నారా ..అయితే ఈ పొరపాట్లు చేస్తున్నారేమో చెక్ చేసుకోండి.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×