E-Paper
Advertisement

Fixed Deposits :ఎఫ్‌డీ అంటే ప్రభుత్వ బ్యాంకులేనా… ఎన్‌బీఎఫ్‌సీల్లోనూ పెట్టొచ్చు

Fixed Deposits :ఎఫ్‌డీ అంటే ప్రభుత్వ బ్యాంకులేనా… ఎన్‌బీఎఫ్‌సీల్లోనూ పెట్టొచ్చు
Advertisement
Fixed Deposits

Fixed Deposits : ఎక్కువ రాబడి ఇచ్చే పథకాలు ఎన్నో ఉన్నా.. కొంత మంది ఫిక్స్‌డ్ డిపాజిట్లకే మొగ్గుచూపుతుంటారు. స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్ మెంట్, మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడికి మంచి రాబడులు వస్తాయి. కాని, పెట్టిన పెట్టుబడికి సేఫ్టీ ముఖ్యం అనుకునే వాళ్లు బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లలోనే పెడుతుంటారు. అలా డిపాజిట్స్ చేస్తున్నారు కాబట్టే.. బ్యాంకులు అప్పులు ఇవ్వగలుగుతున్నాయి. కొంతకాలంగా బ్యాంకుల వద్ద లిక్విడిటీ తగ్గడంతో డిపాజిట్ రేట్లను పెంచాయి. ప్రభుత్వ బ్యాంకులను చూసి ప్రైవేట్ బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకులకు మించి నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలు డిపాజిట్లపై వడ్డీరేట్లు పెంచుకుంటూ పోయాయి.

Advertisement

బ్యాంకుల్లో ఫిక్స్‌‌డ్ డిపాజిట్లు అనగానే.. అందరికీ ముందుగా ప్రభుత్వ బ్యాంకులే గుర్తొస్తాయి. కాని, అంతకు మించి వడ్డీ ఇచ్చే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలు చాలా ఉన్నాయి. వాటిల్లో ఏకంగా 9 శాతం వడ్డీ ఇచ్చేవి కూడా ఉన్నాయి.

సపోజ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్  ఫిన్‌ కేర్‌ విషయానికొస్తే.. ఈ బ్యాంక్ 750 రోజుల కాల పరిమితికి 8.71 శాతం ఇంట్రస్ట్ రేట్ ఇస్తోంది. కాకపోతే, సీనియర్‌ సిటిజన్లకు మాత్రమే ఈ ఆఫర్. ఈమధ్య బాగా దూసుకెళ్తున్న స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఈక్విటాస్‌. ఈ సంస్థ కూడా 888 రోజుల కాల పరిమితి గల డిపాజిట్లపై 8.50 శాతం వడ్డీ చెల్లిస్తోంది. ఇలా 8 శాతానికి మించి వడ్డీ చెల్లిస్తున్న స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకులు మార్కెట్లో చాలా ఉన్నాయి. ఉజ్జీవన్‌ అనే స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ సైతం 559 రోజుల కాల పరిమితి ఉండే డిపాజిట్లపై 8.20 శాతం వడ్డీ ఇస్తోంది. వీటిల్లో 9 శాతం వడ్డీ చెల్లించే ఎస్‌ఎఫ్‌బీలు సైతం ఉన్నాయి. యూనిటీ ఎస్‌ఎఫ్‌బీ 1001 రోజుల కాల పరిమితికి గాను 9.5 శాతం వడ్డీని అందిస్తోంది. కాకపోతే, ఇది కూడా సీనియర్ సిటిజన్లకు ఇస్తున్న ఆఫర్. ఇక సూర్యోదయ ఎస్ఎఫ్‌బీ కూడా సీనియర్ సిటిజన్ల కోసం 999 రోజుల డిపాజిట్లపై 9.05 శాతం వడ్డీ ఆఫర్ చేస్తోంది.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×