E-Paper
Advertisement

Drive in Theatre:హైదరాబాద్‌లో తొలి శాశ్వత డ్రైవ్-ఇన్ థియేటర్.. ఎక్కడంటే!

Drive in Theatre:హైదరాబాద్‌లో తొలి శాశ్వత డ్రైవ్-ఇన్ థియేటర్.. ఎక్కడంటే!
Advertisement

Drive in Theatre:హైదరాబాద్‌లో శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం-RGIAలో త్వరలో తొలి డ్రైవ్-ఇన్ థియేటర్‌ రాబోతోంది. ఇది కొద్ది రోజులు మాత్రమే నిర్వహించేది కాదు… శాశ్వతంగా ఏర్పాటు చేయబోతున్నారు. అంటే… సినీ ప్రేమికులు వారి సొంత కార్ల దగ్గరి నుంచే ఇష్టమైన చిత్రాలను ఆస్వాదించే అవకాశం రాబోతోందన్నమాట.

హైదరాబాద్‌లో ఇప్పటికే ‘స్టార్‌లిట్ సినిమాస్’ వంటి కొన్ని సంస్థలు అప్పుడప్పుడూ బహిరంగ ప్రదేశాల్లో సినిమాలను ప్రదర్శిస్తున్నాయి. ఇవి రోజూ కాకుండా… చాలా అరుదుగా మాత్రమే ఉంటాయి. కానీ… శంషాబాద్ విమానాశ్రయంలో శాశ్వతంగా ఏర్పాటు చేయబోయే తొలి డ్రైవ్-ఇన్ థియేటర్‌తో… ఈ ట్రెండ్ మరింత ఊపందుకునే అవకాశం ఉందని అంటున్నారు. సినిమాలను ఆస్వాదించడానికి ఆహ్లాదకరమైన, సురక్షితమైన ప్రత్యేక ఏర్పాట్లు చేస్తే… జనాదరణ కచ్చితంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.

Advertisement

శంషాబాద్ విమానాశ్రయంలో ఏటికేడు ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగిపోతోంది. దానికి తగ్గట్లే విమానాశ్రయాన్ని కూడా వేగంగా విస్తరిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో విమానాలు ఆలస్యం కావడం వల్ల… చాలా మంది ప్రయాణికుల సమయం వృథా అవుతోంది. అలాంటి వారికి ఈ డ్రైవ్-ఇన్ థియేటర్ ద్వారా విమానాశ్రయంలోనే వినోదం దొరకడంతో పాటు… సమయం వృథా అయ్యిందనే భావన రాకుండా ఉంటుందని భావిస్తున్నారు. ఈ ప్రత్యేకమైన కాన్సెప్ట్ ప్రారంభమైతే… స్థానికులు, ప్రయాణికులకు ఇదొక ప్రసిద్ధ గమ్యస్థానంగా మారొచ్చని అంచనా వేస్తున్నారు. నగర జీవితంలోని హడావిడి నుండి జనం బయటపడి, ఆహ్లాదకరమైన సాయంత్రాలకు దీన్నో డెస్టినేషన్‌గా మార్చుకునే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.

శంషాబాద్ విమానాశ్రయంలో మొత్తం ఎంత స్థలంలో డ్రైవ్-ఇన్ థియేటర్ ఏర్పాటు చేస్తున్నారు? అక్కడ ఎన్ని కార్లకు ఎంట్రీ ఉంటుంది? టికెట్ ధరలు ఎంత ఉంటాయి? ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది? అనే వివరాలు ఇంకా బయటికి రాలేదు. అవి తెలిస్తే… డ్రైవ్-ఇన్ థియేటర్ అనుభూతి పొందాలన్న ఆసక్తి అందరిలోనూ పెరిగే ఛాన్స్ ఉంది.

Advertisement

Railways New Service:దిగాల్సిన స్టేషన్ ఇక మిస్ కాదు.. రైల్వే శాఖ కొత్త సర్వీస్..

Subscription Sharges:మస్క్ బాటలో మార్క్

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×