E-Paper
Advertisement

Fathers role in infant sleep : పసిపిల్లల నిద్ర విషయంలో తండ్రులదే కీలక పాత్ర..!

Fathers  role in infant sleep  : పసిపిల్లల నిద్ర విషయంలో తండ్రులదే కీలక పాత్ర..!
Advertisement
Fathers  role in infant sleep

Fathers role in infant sleep : మామూలుగా పిల్లల్లు పుట్టినప్పటి నుండి పెరిగేవరకు.. వారి పెంపకం విషయంలో తల్లుల పాత్రే ఎక్కువగా ఉందని అంటుంటారు. కానీ అది నిజం కాదని తండ్రి పాత్ర కూడా సమానంగా ఉంటుందని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తుంటారు. శాస్త్రవేత్తలు పరిశోధనల ప్రకారం ఆ అభిప్రాయాలు కూడా నిజాలే. ముఖ్యంగా పసిపిల్లలు నిద్రపోవడానికి, తల్లిపాలు తాగడానికి తండ్రి సపోర్ట్ ఎక్కువగా ఉండాలని తాజా పరిశోధనల్లో తేలింది.

Advertisement

పిల్లల్లు పుట్టినప్పటి నుండి ఆర్థికంగా కుటుంబాన్ని, పిల్లల భవిష్యత్తును డిజైన్ చేసే బాధ్యత.. తండ్రులపై పడుతుంది. కానీ పిల్లల ఆరోగ్యం విషయంలో కూడా తండ్రుల పాత్ర ఉంటుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. తల్లులు పిల్లలకు పాలు తాగించాలంటే.. అందులో తండ్రులు కూడా తల్లులకు సపోర్ట్ చేసే విధంగా ఉండాలని, అప్పుడే పిల్లలు పాలు తాగడానికి ఇష్టపడతారని తేలింది. అలా సపోర్ట్ చేయని తండ్రులు కూడా ఉంటారని, అప్పుడు పిల్లలకు పాలు పట్టించే విషయంలో ఇబ్బందులు ఎదురవుతాయని అన్నారు.

శాస్త్రవేత్తలు చేసిన ఈ స్టడీ కోసం 250 మంది తండ్రులను ఎంపిక చేసి రెండు నుండి ఆరు నెలల వరకు సర్వే నిర్వహించారు. పాలు తాగించడం మాత్రమే కాదు.. పసిపిల్లలు సంతోషంగా నిద్రపోవాలన్నా తండ్రి పాత్ర ఉండాల్సిందే అని ఈ స్టడీలో తేలింది. కొన్ని కుటుంబాల్లో పసిపిల్లలకు తల్లి పాలు తాగించడానికి ఎవరూ సపోర్ట్ చేయరు. అలాంటప్పుడే తండ్రులు ముందుకు రావాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఇలాంటి విషయంలో తల్లి పాత్ర ఎంత ఉంటుందో.. తండ్రి పాత్ర కూడా అంతే ఉంటుందన్నారు.

Advertisement

అప్పుడే పుట్టిన పిల్లలను నిద్రపుచ్చడానికి తండ్రులు ఇష్టపడతారు. కానీ అందులో కొంతమందికి మాత్రమే వారిని ఎలా నిద్రపుచ్చాలో కరెక్ట్‌గా తెలుసు. స్టడీ ప్రకారం 99 శాతం తండ్రులు వారి పసిపిల్లలను నిద్రపుచ్చుతారు. కానీ అందులో 16 శాతం మందికి మాత్రమే పసిపిల్లల స్లీపింగ్ పొజిషన్స్ గురించి కరెక్ట్‌గా తెలుసు. అవే బ్యాక్ స్లీపింగ్ పొజిషన్, కరెక్ట్ స్లీప్ సర్ఫేస్, సాఫ్ట్ బెడ్డింగ్ లేకపోవడం.. ఇలా మూడు స్లీపింగ్ పొజిషన్స్ గురించి కొందరికి మాత్రమే అవగాహన ఉంది. అమెరికాలో నిద్రకు సంబంధిత వ్యాధులు కలిగి ఏడాదికి 3000 మంది పసిపిల్లలు చనిపోతూ ఉంటారు. అందుకే తల్లిదండ్రులు ఇద్దరూ వారి పసిపిల్లలు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×