E-Paper
Advertisement

Marriage : పెళ్లికి సిద్ధమవుతున్నారా.. ఈ విషయాల్లో క్లారిటీ మస్ట్ గురూ..!

Marriage : పెళ్లికి సిద్ధమవుతున్నారా.. ఈ విషయాల్లో క్లారిటీ మస్ట్ గురూ..!
Advertisement

Marriage : వివాహం అనేది ఏడు జన్మల బంధం అంటారు. అందుకు పెళ్లి చేసేముందు ఇటేడు తరాలు అటేడు తరాలు చూడాలంటారు పెద్దోళ్లు. ప్రతి మినిషి జీవితంలో పెళ్లికి ఎంతో ప్రాధాన్యత ఉంది. వందేళ్ల జీవితానికి మజిలీగా చెప్పుకునే పెళ్లి విషయంలో ప్రతీ ఒక్కరూ ఎన్నో ప్లాన్స్ వేసుకుంటారు. ఎన్నో ఆశలతో కొత్తజీవితంలోకి అడుగు పెడతారు.

అయితే పెద్దలు కుదిర్చిన వివాహమైనా అన్నీ కుదిరాకే ఓ మాటకొస్తారు. పెళ్లంటే కేవలం పెద్దవారికే కాదు.. పెళ్లి చేసుకునే వారికి కూడా కొన్ని విషయాలలో క్లారిటీ ఉండాలి. అలా అయితేనే ఫ్యూచర్‌లో ఎటువంటి సమస్యలు రావంటున్నారు నిపుణులు. ఇంతకీ ఆ ఫ్యూచర్ లైఫ్ పాట్నర్ గురించి ఏ విషయాల్లో క్లారిటీ ఉండాలో తెలుసుకుందాం.

  • మీకు ఎలాంటి విషయాలు నచ్చుతాయి, ఎలాంటివి నచ్చవో ముందే మీ లైఫ్ పార్ట్నర్ కి తెలియజేయండి. వారికి నచ్చని విషయాలు గురించి కూడా ఆరా తీయండి. ఏ విషయాలు మీ పార్ట్నర్ కి నచ్చవో వాటిలో జాగ్రత్తలు తీసుకోండి.
  • ఏ రిలేష్‌కు అయినా మూలం డబ్బు. అందుకే బంధాన్ని ముడిపెట్టేది.. విడదీసేది డబ్బే అంటారు. డబ్బు విషయంలో ఎక్కడో ఒక దగ్గర అభిప్రాయ బేధాలు వస్తుంటాయి. కాబట్టి పెళ్లికి ముందే ఆర్థిక వనరుల గురించిన విషయాలపై చర్చించుకోండి.
  • కొందరు ఒకరిని ప్రేమిస్తారు. పరిస్థితుల వల్ల మరొకరిని పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. దీనికి మీరు మానసికంగా రెడీ అయితే ఫర్వాలేదు. కానీ మనసులో ఒకరుండి.. ఇంకొకరిని పెళ్లి చేసుకుంటే ఇద్దరి జీవితాలు, రెండు కుటుంబాలు ఆగమైపోతాయి. కాబట్టి ఇటువంటి విషయాలు ముందే చెప్పేయండి.
  • ఈ రోజుల్లో స్త్రీ, పురుషులు ఇద్దరూ కెరీర్‌లో సమానంగా రాణిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో పిల్లల విషయంలోనూ ఓ క్లారిటీతో ఉండాలి. అదే విషయాన్ని మీ పార్ట్నర్ తో వివరించండి.
  • వివాహం తరువాత మీరు ఎలా ఉండాలనుకుంటున్నారు. జీవితంలో ఎలాంటి ప్రణాళికలు రచించాలనుకున్నారు. ఇటువంటి విషయాలపై మీ పార్ట్నర్ తో ఓ క్లారిటీ తీసుకోండి.
  • మీకు కాబేయే లైఫ్ పార్ట్నర్ గురించి కుటుంబంతో పెళ్లికి ముందే చర్చించండి. ముఖ్యంగా ఉమ్మడి కుటుంబంలో జీవించేవారు తమ భవిష్యత్తు గురించి ముందుగానే స్పష్టమైన నిర్ణయం తీసుకోవడం ఉత్తమం.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×