E-Paper
Advertisement

తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయం.. ఎంపీ ఈటల రాజేందర్ ధీమా

తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయం.. ఎంపీ ఈటల రాజేందర్ ధీమా
Advertisement

రాబోయే కాలంలో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కావడం ఖాయమని మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ ధీమా వ్యక్తం చేశారు. సోమవారం స్థానిక ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆదివారం నిర్వహించిన ప్రధాని మోదీ సభను విజయవంతం చేసిన కంటోన్మెంట్ బీజేపీ నాయకులు కార్యకర్తలు మీడియా ప్రతినిధులకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ బీజేపీ నాయకత్వంలో ఎలాంటి లోపం లేదని సమర్థవంతమైన నాయకత్వం రాష్ట్రంలో ఉందని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పినట్లుగానే తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని దేశానికి రోల్ మోడల్‌గా ఉన్న హైదరాబాద్ నగరాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని స్పష్టం చేశారు. ప్రధాని మోదీ హాజరైన సభతో రాబోయే ఎన్నికల్లో తెలంగాణ గడ్డపై గెలవబోయేది బీజేపీయేనని ప్రజలకు స్పష్టమైన సంకేతాలు అందాయని అన్నారు.

తాను సంవత్సరంలో 365 రోజులు ప్రజలకు అందుబాటులో ఉంటానని రాష్ట్రంలో ప్రజా సమస్యలను నిరంతరం పట్టించుకునే ఏకైక పార్టీ బీజేపీ అని పేర్కొన్నారు. త్వరలో నియోజకవర్గ స్థాయిలో కార్యకర్తల సమావేశాలు నిర్వహిస్తామని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. మోదీ మూడోసారి ప్రధాని అయిన తర్వాత దేశవ్యాప్తంగా బీజేపీ మరింత విస్తరించిందని తెలంగాణలో కూడా అధికారం చేపట్టడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రం అప్పుల ఊబిలో నుంచి బయటపడాలన్నా రైతులు విద్యార్థుల సమస్యలు శాశ్వతంగా పరిష్కారం కావాలన్నా బీజేపీ అధికారంలోకి రావాలని ప్రజలు బలంగా కోరుకుంటున్నారని ఆయన వివరించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కార్యకర్తలు కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు.

Advertisement

తెలంగాణలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు బీజేపీకి అనుకూలంగా మారుతున్నాయని ఈటల రాజేందర్ విశ్లేషించారు. అవినీతి రహిత పాలన అందించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ముఖ్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తామని వెల్లడించారు. సామాన్య ప్రజల గొంతుకగా అసెంబ్లీ పార్లమెంట్ సాక్షిగా పోరాడుతామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ సభ్యురాలు నర్మద బిఎన్ శ్రీనివాస్ ఎల్‌వీ చెన్నారావు వైశాలిని కట్ట కుమార్ సుబ్బారావు పద్మ ప్రసాద్ విజయ్ ఆనంద్ ఆర్కే శ్రీనివాస్ గిరి భాను ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. పార్టీ బలోపేతం కోసం ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.

తెలంగాణ సమాజం మార్పును కోరుకుంటోందని అది కేవలం బీజేపీతోనే సాధ్యమని ఈటల పునరుద్ఘాటించారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం క్షేత్రస్థాయిలో పోరాటాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. గడపగడపకు బీజేపీ నినాదంతో ముందుకు వెళ్తామని చెప్పారు. విపక్షాల విమర్శలను తిప్పికొడుతూ అభివృద్ధి అజెండాతో ఎన్నికలకు వెళ్తామని ధీమా వ్యక్తం చేశారు. కంటోన్మెంట్ ప్రాంత సమస్యలపై ప్రత్యేకంగా చర్చించి వాటి పరిష్కారానికి కేంద్రం నుంచి నిధులు రాబడతామని హామీ ఇచ్చారు.

Advertisement

ALSO READ: కార్మికుల సంక్షేమమే ప్ర‌జాపాల‌న ల‌క్ష్యం.. కనీస వేతనాల సవరణపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక భేటీ!

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×