E-Paper
Advertisement

Elon Musk:త్వరలోని ఆకాశంలోకి స్పేస్ ఎక్స్ స్టార్‌షిప్..

Elon Musk:త్వరలోని ఆకాశంలోకి స్పేస్ ఎక్స్ స్టార్‌షిప్..
Advertisement

Elon Musk:కొన్నాళ్ల క్రితం వరకు స్పేస్ టెక్నాలజీ, పరిశోధనల్లో కేవలం ప్రభుత్వ రంగాలు మాత్రమే పాల్గొనేవి. కానీ ఇప్పుడు స్పేస్ టెక్నాలజీ కూడా కమర్షియల్‌గా మారిపోయింది. అందుకే ఎన్నో ప్రైవేట్ సంస్థలు కూడా అంతరిక్షంలోకి తమ శాటిలైట్లను పంపుతున్నాయి. అలాంటి ఒక సంస్థే స్పేస్ ఎక్స్. ఎలన్ మస్క్ స్థాపించిన ఈ స్పేస్ ఎక్స్ త్వరలోనే ఓ భారీ ప్రయోగానికి సిద్ధమవుతోంది.

ఈ ఏడాది మార్చ్‌లో ఎలన్ మాస్క్ స్థాపించిన స్పేస్ ఎక్స్ నుండి ఒక స్టార్ షిప్ రాకెట్ లాంచ్ జరగనుంది. తాజాగా ఎలన్ మస్క్ స్వయంగా ఈ విషయాన్నితన ట్విటర్‌లో పేర్కొన్నారు. ఒక యూజర్ తన స్టార్‌షిప్ అప్డేట్‌ను అడిగినదానికి సమాధానం మస్క్ ఈ ట్వీట్ చేశారు. అన్ని అనుకున్నట్టుగా జరిగితే.. వచ్చే నెల ఓ స్టార్‌షిప్ లాంచ్‌కు సన్నాహలు చేస్తున్నామని తన ట్వీట్‌లో చెప్పుకొచ్చారు మస్క్.

Advertisement

స్పేస్ ఎక్స్ మాత్రమే కాకుండా ఇంకా ఎన్నో అమెరికా సంస్థలు స్పేస్ పెట్టుబడులపై ఆసక్తి చూపిస్తున్నాయి. సెరఫిమ్ స్పేస్ అనే సంస్థ త్వరలోనే స్పేస్ పరిశోధనలకు సంబంధించి 12 స్టార్టప్స్‌కు ప్రారంభించనున్నట్టు ప్రకటించింది. అవన్నీ కలిసి ఓ కొత్త ప్రాజెక్ట్ కోసం 150 మిలియన్ డాలర్ల పెట్టుబడిని సేకరించనున్నాయి. వాతావరణ మార్పుల నుండి డిఫెన్స్ కమ్యూనికేషన్స్ వరకు అన్ని రంగాలలో ఈ స్టార్టప్స్ పనిచేయనున్నాయి.

అమెరికాను చూసి మరెన్నో దేశాలు కూడా స్పేస్ పరిశోధనలను వేగవంతం చేయనున్నాయి. ఇజ్రాయిల్ లాంటి దేశాలు ఇప్పటికే బయో హైబ్రిడ్ రోబోను తయారు చేశాయి. చైనా అయితే ఏకంగా చంద్రుడిపై తమ జెండాను పాతాలని ప్రయత్నాలు చేస్తోంది. అందుకే ప్రభుత్వాలు కూడా స్పేస్ టెక్నాలజీలో భారీ పెట్టుబడులు పెట్టడానికి వెనకాడడం లేదు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×