E-Paper
Advertisement

Sunflower Seeds: సన్‌ఫ్లవర్ సీడ్స్‌తో మ్యాజిక్.. బ్యూటీ పార్లర్లకి వెళ్లరిక!

Sunflower Seeds: సన్‌ఫ్లవర్ సీడ్స్‌తో మ్యాజిక్.. బ్యూటీ పార్లర్లకి వెళ్లరిక!
Advertisement

Sunflower Seeds: ప్రతి మగువా కోరుకునేదేంటంటే.. తమ చర్మ సౌందర్యాన్ని సహజసిద్ధంగానే మెరిపించుకోవాలని. అలాంటి నేచురల్ గ్లో పొందడం కోసం చాలామంది రకరకాల బ్యూటీ ప్రొడక్ట్స్ వాడుతుంటారు. అయితే, అవేవీ లేకుండానే వంటింట్లో దొరికే గుప్పెడంత పొద్దుతిరుగుడు గింజలతో మిలమిల మెరిసే చర్మాన్ని పొందవచ్చు అంటున్నారు నిపుణులు. హెల్తీ స్కిన్ కోసం రోజూ పొద్దుతిరుగుడు గింజలు డైరెక్ట్‌గా తినొచ్చు. లేదా ప్యాక్‌ మాదిరి ఫేస్‌కి రాసుకోవచ్చు. దీంతో ముఖం మీద మొటిమలు, మచ్చలు లేకుండా చర్మం ప్రకాశిస్తుంది.

పొడి చర్మం నుంచి విముక్తి..

పొద్దుతిరుడు గింజలను 2 గంటల పాటు ఎండలో ఉంచి, ఆ తర్వాత మిక్సీ చేసుకోవాలి.  అలాగాని మెత్తగా కాకుండా.. కాస్త గరుకుగా  చేసుకోవాలి. ఇలా తయారుచేసిన పొడిని టీస్పూన్ తీసుకుని, దానికి కొద్దిగా పాలు, చిటికెడు పసుపు కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని 20 నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఆ తర్వాత కడిగేస్తే సరిపోతుంది. ఈ ప్యాక్ ముఖంపై పేరుకొన్న మురికిని తొలగిస్తుంది.

డ్రై ప్యాచెస్ ఉండవిక..

Advertisement

పొడి చర్మం ఉన్నవారికి ముఖమంతా ప్యాచెస్ మాదిరిగా అక్కడక్కడా పొడిగా కనిపిస్తుంటుంది. ఇలాంటి వారికి సన్‌ఫ్లవర్ సీడ్స్‌ ఫేస్‌ప్యాక్  బాగా పనిచేస్తుంది. దీనికోసం సన్‌ఫ్లవర్ సీడ్స్‌ను పొడిగా చేసుకుని, అందులో కొద్దిగా గంధం పొడి, రోజ్‌వాటర్ మిక్స్ చేసుకుని ముఖానికి రాసుకోవాలి. తర్వాత 20 నిమిషాల ఆగి కడిగేసుకోవాలి. ఈ ఫేస్‌ప్యాక్ వేసుకోవడం వల్ల ముఖంపై డ్రై ప్యాచెస్ ఉండవు.

సన్‌ఫ్లవర్ సీడ్స్‌తో ఇతర లాభాలు:

* ప్రతిరోజూ సన్‌ఫ్లవర్ సీడ్స్ తీసుకుంటే శరీరానికి కావాల్సిన పోషకాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయని నిపుణులు చెబుతున్నారు.
* ఈ సీడ్స్‌లో  ప్రొటీన్‌ , జింక్, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్ , విటమిన్‌ ఈ, బీ, బీ6, మంచి కొవ్వులు, పీచుపదార్థం, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.
* సన్‌ఫ్లవర్ సీడ్స్‌లోని విటమిన్లు, పొటాషియం, మెగ్నీషియం రక్త పీడనం నియంత్రణలో ఉంచడానికి తోడ్పడతాయి. విటమిన్‌ బి మెదడు ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది.
*  పొద్దుతిరుగుడు గింజలు రోజూ తింటే.. జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరుగుతాయి. అధిక బరువుని తగ్గించి, రోగనిరోధక శక్తిని పెంచి ఇతర అనారోగ్య సమస్యలు రాకుండా చూస్తాయి.
*  ఈ గింజల్లో ఉండే విటమిన్‌ ఈ చర్మానికి పోషణ అందించి, హానికర కిరణాల నుంచి చర్మాన్ని కాపాడుతుంది. ఆరోగ్యకరమైన చర్మానికి పొద్దుతిరుగుడు గింజలు ఔషధంలా పనిచేస్తాయట.

Advertisement

 

 

 

 

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×