E-Paper
Advertisement

Drinking Warm water : గోరువెచ్చని నీటితో చర్మ సంరక్షణ ఇలా!

Drinking Warm water : గోరువెచ్చని నీటితో చర్మ సంరక్షణ ఇలా!
Advertisement

Drinking Warm water : ప్రతిరోజు గోరువెచ్చని నీటిని తాగడం వల్ల చ‌ర్మానికే కాదు, శరీరంలోని కొన్ని అవయవాలకు కూడా లాభాలు ఉన్నాయి. చర్మ సౌందర్యం కోసం చాలా మంది చికిత్స చేయించుకుంటారు. డబ్బు ఖర్చు చేసి రకరకాల క్రీములు వాడుతుంటారు. అయితే మ‌నం తీసుకునే ఆహారాలు, ద్రవ పదార్థాల మీదే మ‌న చ‌ర్మ సంర‌క్షణ ఆధార పడి ఉంటుంది. ప్రతిరోజు గోరువెచ్చని నీటిని తాగడం వల్ల ఇవన్నీ అక్కర్లేదని నిపుణులు చెబుతున్నారు. శ‌రీరంలో ఎక్కువశాతం నీరు ఉంటుంది. అవ‌య‌వాలు, క‌ణాలు ప‌నిచేసేందుకు, జీవ‌క్రియ‌ల‌కు నీరు చాలా అవసరం. అందుకే రోజూ క‌నీసం 7-8 గ్లాసుల నీటిని తాగాలని డాక్టర్లు చెబుతుంటారు. అంతేకాకుండా గోరువెచ్చని నీటిని తాగడం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయని అంటున్నారు. ప్రతిరోజు ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేవరకు గోరువెచ్చని నీటిని తాగడం అలవాటు చేసుకోవాలి. దీంతో మన శరీర ఉష్ణోగ్రత పెరిగి చెమట వస్తుంది. శరీరంలోని వ్యర్థాలు, విషపదార్థాలు బయటికి వెళ్లిపోతాయి. దీంతో మొటిమలు పెరగకుండా ఉంటాయి. అంతేకాకుండా గోరువెచ్చని నీరు తాగితే మన జీర్ణక్రియ బాగుపడుతుంది. చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. ఉదయం గ్లాసు గోరువెచ్చని నీటిలో కొద్దిగా నిమ్మకాయ రసం, తేనె కలిపి తీసుకుంటే చర్మం సురక్షితంగా ఉంటుంది. శరీరంలోని ద్రవాలు సమతుల్యంలో ఉంటాయి. శరీరం హైడ్రేటెడ్‌గా ఉంటుంది, చర్మం తేమగా ఉంటుంది. గోరువెచ్చని నీరు వల్ల రక్త సరఫరా కూడా బాగుంటుంది. చర్మానికి పోషకాలు అందుతాయి. చర్మం తాజాగా ఉండటంతో పాటు ఫ్రీ ర్యాడికల్స్‌తో దెబ్బతిన్న చర్మ కణాలు పునరుత్తేజం అవుతాయి. అంతేకాకుండా చర్మంపై ముడతలు, మచ్చలు తగ్గిపోయి వృద్ధ్యాప్య ఛాయలు కనిపించవు. గోరువెచ్చని నీటి వల్ల మల బద్ధకం పోతుంది, ఉదయాన్నే పరగడుపున గోరువెచ్చని నీటిని తాగడం వల్ల శరీరంలోని వ్యర్థాలు బయటికిపోతాయి. మెట‌బాలిజం పెరిగి అధిక బ‌రువు త‌గ్గుతారు. శ‌రీరంలోని కొవ్వు క‌రుగుతుంది.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×