E-Paper
Advertisement

Lemon Juice : నిమ్మరసం తాగితే గ్యాస్‌ సమస్య పెరుగుతుందా?

Lemon Juice : నిమ్మరసం తాగితే గ్యాస్‌ సమస్య పెరుగుతుందా?
Advertisement

Lemon Juice :నిమ్మరసాన్ని ప్రతిరోజు తాగడం వల్ల ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉంటాయి. నిమ్మరసం, తేనె కలిపి తాగితే ఎన్నో సమస్యలను దూరం చేస్తుంది. అయితే నిమ్మరసంలో ఉండే యాసిడ్ స్వభావంతో గ్యాస్ ఉన్న వారు దీనిని తాగితే మరింత ఎక్కువవుతుందని కొందరు అపోహలు సృష్టిస్తూ ఉంటారు. నిమ్మరసం ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటుంది. కానీ నిమ్మరసాన్ని తీసుకున్నప్పుడు అది మన నోట్లోని లాలాజలంతో కలిశాక సుమారు ఒక గంట తర్వాత అది క్షార స్వభావాన్ని పొందుతుంది. దీంతో జీర్ణాశయంలో క్షార వాతావరణం ఏర్పడుతుంది. దీనివల్ల గ్యాస్ యాసిడిటీ సమస్యలు తగ్గిపోతాయి. అంతేకానీ నిమ్మరసం తీసుకోవడం వల్ల గ్యాస్ అనేది పెరగదు. నిమ్మరసంలో యాసిడ్‌ స్వభావం ఉన్నప్పటికీ ఇది మన శరీరంలో ఆల్కలైన్‌గా మారుతుంది. దీనివల్ల గ్యాస్ సమస్యలు ఉన్నవారు కూడా నిమ్మరసాన్ని తీసుకోవచ్చని నిపుణులు అంటున్నారు. అయితే ఏ పదార్ధాన్ని అయినా మితంగా తీసుకోవాలి. అధికంగా తీసుకుంటే సమస్యలు వస్తాయి. రోజు ఉదయాన్నే ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిని తీసుకొని అందులో నిమ్మరసం కలుపుకొని తాగవచ్చు. దీంతో పాటు అవసరం అనుకుంటే తేనె, అల్లం రసం కలుపుకోవచ్చు. దీనివల్ల శరీర మెటబాలిజం పెరిగి కొవ్వు కరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు. అలాగే మన శరీరంలో ఉన్న వ్యర్ధాలు కూడా బయటకు పోతాయని వైద్యులు చెబుతున్నారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×