E-Paper
Advertisement

Diet to Loose Weight: ఓ మై గాడ్.. కేవలం 4 వారాల్లో 4 కిలోల బరువు తగ్గిన మహిళ, ఇలా చేస్తే మీరూ తగ్గిపోవచ్చు!

Diet to Loose Weight: ఓ మై గాడ్.. కేవలం 4 వారాల్లో 4 కిలోల బరువు తగ్గిన మహిళ, ఇలా చేస్తే మీరూ తగ్గిపోవచ్చు!
Advertisement

Diet to Loose Weight: ఊబకాయం సమస్యతో ఇబ్బంది పడుతున్న వారు బరువు తగ్గేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తారు. జిమ్‌కు వెళ్లి వర్కౌట్ చేయడం, వాకింగ్, ఫాస్టింగ్, కొత్త కొత్త డైట్‌లు ఫాలో అవ్వడం వంటివి చేస్తారు. అయినా సరే కొన్ని సార్లు బరువు తగ్గడం కష్టతరంగా మారుతుంది. అలాంటి వారు నెల రోజుల్లోనే బరువు తగ్గేందుకు సహాయపడే వైరల్ డైట్ ఫాలో కావడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

సౌత్ కొరియాకు చెందిన మోడల్ షెర్రీ ఈ డైట్ వల్లే కేవలం నెల రోజుల్లోనే 4 కిలోల బరువు తగ్గింది. తన వెయిట్ లాస్ జర్నీకి సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. అంత తక్కువ సమయంలో బరువు తగ్గిన తన ‘స్విచ్ ఆన్ డైట్’ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Advertisement

ఈ స్విచ్ ఆన్ డైట్ శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ని తొలగించేందుకు హెల్ప్ చేస్తుందని, గట్ హెల్త్‌ని రక్షిస్తుందని షెర్రీ తెలిపింది. తన లాగా మీరు కూడా వేగంగా బరువు తగ్గాలంటే ఈ వైరల్ స్విచ్ ఆన్ డైట్‌ని ఫాలో అయిపోండి..!

ఈ డైట్ ప్రారంభించే ముందు ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. మొదటి వారంలో శరీరాన్ని డిటాక్సిఫై చేసి గట్‌ని రీసెట్ చేసేందుకు ఎక్కువగా ప్రోటీన్ షేక్స్, కూరగాయలు, అధికంగా ప్రోటీన్స్ ఉండే ఆహరం తీసుకోవాలి.

Advertisement

ALSO READ: గ్లోయింగ్ స్కిన్ కోసం టిప్స్

రెండో వారంలో తక్కువ ఆహారం తీసుకున్నా సరే అందులో అధికంగా ప్రోటీన్స్ ఉండేలా చూసుకోవాలి. మూడో వారంలో ఒక పూట ఉపవాసం ఉంటూ ఎక్కువ ప్రోటీన్స్ ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి.

నాలుగో వారంలో శరీరంలోని ఫ్యాట్‌ను తొలగించడానికి ఉవాసం ఉంటూనే కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. ఇలా చేస్తే శరీరంలో పేరుకుపోయిన చెడు కొవ్వు తొలగిపోతుందట.

అయితే ఈ డైటింగ్ చేసినప్పుడు ప్రోటీన్ షేక్స్, ఫ్యాట్ లేని చికెన్, గుడ్లు, బెర్రీలు, అరటిపండ్లు, చిలగడదుంపలు తీసుకోవచ్చు. కెఫిన్, మద్యం, ప్రాసెస్ చేసిన ఆహారం, చక్కెర తీసుకోవడం పూర్తిగా మానేయాలి. శరీరం తీరును బట్టి ఈ డైట్ రిజల్ట్స్‌ అందరిలో ఒకేలా ఉండకపోవచ్చు. ఈ రకమైన డైట్ స్టార్ట్ చేసే ముందు డైటీషియన్ సలహా తీసుకోవడం మంచిదని నిపుణుల సూచిస్తున్నారు.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×