E-Paper
Advertisement

Danger Salt : ఉప్పు తిని ఇంతమంది చనిపోయారా..? షాకింగ్ నిజాలు..!

Danger Salt : మనం తీసుకునే ఆహారమే మన ఆరోగ్యాన్ని కాపడుతుంది. కానీ ప్రస్తుత కాలంలో ఉన్న ఆహారపు అలవాట్లతో ప్రజలు చాలా మంది అనారోగ్యం బారిన పడుతున్నారు. మసాలాలు, ఉప్పు కారం లేని ఆహారం తినాలంటే మన వళ్ల కాదు. ముఖ్యంగా ఉప్పు లేని ఆహారాన్ని ఊహించలేం. ఉప్పు ఆహారం రుచిని పెంచుతుంది. అది ఆరోగ్యానికి మంచిది కాదని తెలిసినా.. రుచి కోసం తినక తప్పడం లేదు.

Danger Salt : ఉప్పు తిని ఇంతమంది చనిపోయారా..? షాకింగ్ నిజాలు..!
Advertisement

Danger Salt : మనం తీసుకునే ఆహారమే మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది. కానీ ప్రస్తుత కాలంలో ఉన్న ఆహారపు అలవాట్లతో ప్రజలు చాలా మంది అనారోగ్యం బారిన పడుతున్నారు. మసాలాలు, ఉప్పు కారం లేని ఆహారం తినాలంటే మనవళ్ల కాదు. ముఖ్యంగా ఉప్పు లేని ఆహారాన్ని ఊహించలేం. ఉప్పు ఆహారం రుచిని పెంచుతుంది. అది ఆరోగ్యానికి మంచిది కాదని తెలిసినా.. రుచి కోసం తినక తప్పడం లేదు.

ఉప్పేమి విషపూరితం కాదు. అయితే.. కొన్ని సందర్భాల్లో ప్రతికూల ప్రభావాలను చూపుతుంది. ఉప్పు ఎక్కువగా తీసుకుంటే అధిక రక్తపోటు, గుండెజబ్బులు, కిడ్నీ, మెదడు అనేక సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లెక్కల ప్రకారం.. అధికంగా ఉప్పు తీసుకోవడం వల్ల ఏటా 1.89 మిలియన్ల మంది మరణిస్తున్నారు.

Advertisement

ఉప్పులో ఎక్కువగా కనిపించే పదార్థం సోడియం. ఇది మాంసం, పాలు వంటి వివిధ ఆహారాలలో కూడా సహజంగా ఉంటుంది. సోడియం సాధారణ కణాల పనితీరును నిర్వహించడానికి సహాయపడే ముఖ్యమైన పోషణం. సోడియం ఎక్కువ తీసుకోవడం వల్ల గుండె జబ్బులు, పక్షపాతం, అకాల మరణాలు సంభవించే ప్రమాదం ఉందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఓ నివేదికలో పేర్కొంది.

హార్వర్డ్ మెడికల్ స్కూల్ ఉప్పుపై చేసిన అధ్యయనాల ప్రకారం.. సోడియం అధికంగా తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు వస్తుంది. ఇది గుండె ఆగిపోయే ప్రమాదాన్ని మరింత పెంచుతుందని వెల్లడించింది. గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వ్యక్తులకు అనేక సమస్యలను కలిగిస్తుంది.

Advertisement

వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నివేదిక ప్రకారం.. పెద్దలు రోజుకు 2 గ్రాములు ఉప్పు తినాలి. ఇది ఒక టీస్పూన్ కంటే తక్కువ. పిల్లలకు వారి అవసరాలకు అనుగుణంగా మోతాదును బట్టి ఇవ్వొచ్చు. మరీ ఎక్కువ కూడా ఇవ్వకూడదు. మెదడు అభివృద్ధికి ఉప్పులో ఉండే అయోడిన్ సహాయపడుతుంది.

ఉప్పు వినియోగాన్ని తగ్గించే చిట్కాలు

  • టెబుల్ మీద సాల్ట్ డబ్బా తీసేయండి
  • కూర పూర్తిగా ఉడికిన తరువాత ఉప్పు వేయడం అలవాటు చేసుకోండి
  • ప్రాసెస్ట్ ఫుడ్స్ మానేయండి
  • ఊరగాయలు తినడం తగ్గించండి
  • సముద్రపు ఉప్పైనా, సాల్ట్ అయినా.. సోడియం ఉంటుందని మరచిపోవద్దు
  • బయట తిండి మానేయండి
  • ప్యాక్డ్ ఫుడ్స్ తినకపోవడం మంచిది

ఆహారం రుచిగా ఉండాలంటే ఉప్పు అవసరం. కాబట్టి పూర్తిగా తగ్గించడం సాధ్యం కాదు. మోతాదుకు మించి ఉప్పు తీసుకోకండి. ఉప్పుకు బదులుగా రుచి కోసం నిమ్మసరం, వెనిగర్, వోమ మొదలైనవి వాడొచ్చని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సూచిస్తుంది.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×