E-Paper
Advertisement

Demand For Flats: ఫ్లాట్లకే గిరాకీ… ఎంత మంది కొంటున్నారంటే..

Demand For Flats: ఫ్లాట్లకే గిరాకీ… ఎంత మంది కొంటున్నారంటే..
Advertisement

Demand For Flats:దేశంలో ఇళ్ల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. ముఖ్యంగా ఫ్లాట్లు కొనేందుకే మెజారిటీ జనం మొగ్గుచూపుతున్నారు. 2022లో ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, కోల్‌కతా, పుణె నగరాల్లో మొత్తం 2,15,666 ఫ్లాట్లు అమ్ముడుపోయాయి. 2021లో 1,28,024 ఫ్లాట్లు మాత్రమే అమ్ముడుపోగా, నిరుడు ఫ్లాట్ల విక్రయాలు ఏకంగా 68 శాతం పెరిగాయి. గత పదేళ్లలోనే ఇది అత్యధికం. 2010లో 2,16,762 ఫ్లాట్లు అమ్ముడుపోగా… మళ్లీ 2022లోనే ఆ స్థాయిలో ఫ్లాట్ల అమ్మకాలు జరిగాయి. ఈ జోరు ఈ ఏడాది కూడా కొనసాగవచ్చని నిర్మాణ సంస్థలు అంచనా వేస్తున్నాయి. దీర్ఘ కాల పరిమితితో కూడిన రుణాలు, అత్యుత్తమ ధరల వల్ల… జనం ఫ్లాట్లు కొనేందుకు మొగ్గుచూపుతున్నారని అంటున్నాయి.

మరోవైపు… ఇళ్లు కొనేవారిలో 71 శాతం మంది అపార్ట్‌మెంట్లలోని ఫ్లాట్లవైపే మొగ్గుచూపుతున్నారని… ఓ సర్వే తేల్చింది. కొనేందుకైనా, అద్దెకైనా… 3 లేదా 2 పడక గదుల ఇళ్ల కోసమే ఎక్కువ మంది వెతుకుతున్నారని చెబుతోంది. హైదరాబాద్‌లో అత్యధికంగా 56 శాతం మంది 3 బీహెచ్‌కే, ఆపై ఇళ్ల మీద ఆసక్తి చూపించగా… 2 బీహెచ్‌కే ఫ్లాట్లు కావాలని 41 శాతం మంది మాత్రం కోరుకున్నారు. ఇక సింగిల్ బెడ్‌రూమ్‌ ఫ్లాట్ కోసం కేవలం 3 శాతం మందే వెతికారని తేలింది. 25 శాతం మంది మాత్రం ఇండిపెండెంట్ హౌస్ లేదా విల్లాల కోసం సెర్చ్ చేశారని సర్వేలో తేలింది.

Advertisement

2022లో ఇల్లు కొనాలనుకునే వారిని ఆకర్షించిన నగరాల జాబితాలో హైదరాబాద్‌ నాలుగో స్థానంలో నిలిచింది. తొలి స్థానం బెంగళూరు దక్కించుకోగా, రెండో స్థానంలో ముంబై, మూడో స్థానంలో పుణే నిలిచాయి. ఈ నాలుగు నగరాల్లో 80 శాతం మంది అపార్ట్‌మెంట్లలోని ఫ్లాట్లు కొనేందుకే మొగ్గు చూపించారు. హైదరాబాద్‌లో ప్రధానంగా కొండాపూర్, మియాపూర్, గచ్చిబౌలి, మణికొండ, బీరంగూడ ప్రాంతాల్లో ఇళ్లు కొనేందుకు నగరవాసులు ఆసక్తి చూపించారు.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×