E-Paper
Advertisement

Dead Nasa satellite : భూమివైపుగా దూసుకొస్తున్న నాసా పాత శాటిలైట్..

Dead Nasa satellite : భూమివైపుగా దూసుకొస్తున్న నాసా పాత శాటిలైట్..
Advertisement
Dead Nasa satellite

Dead Nasa satellite : ఇప్పటికే స్పేస్‌లో శాటిలైట్లకు సంబంధించిన చెత్త ఎక్కువయిపోయిందని పరిశోధకులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. దాంతో పాటు గ్రహశకలాలు కూడా స్పేస్‌లో ఖాళీ లేకుండా చేస్తున్నాయని వారు ఇప్పటికే బయటపెట్టారు. అందుకే భూమిపై పడే గ్రహశకలాల సంఖ్య ఎక్కువవుతుందని కూడా వారు భావిస్తున్నారు. ఇప్పటికే ఒకేవారంలో అయిదు గ్రహశకలాలు భూమికి దగ్గరగా వెళ్లడం ప్రజలను ఆందోళనకు గురిచేయగా.. తాజాగా మరో హెచ్చరిక విడుదలయ్యింది.

నాసాకు సంబంధించిన ఒక పాత శాటిలైట్ స్పేస్ నుండి భూమివైపుగా దూసుకొస్తోందని శాస్త్రవేత్తలు గమనించారు. అయితే ఇప్పటికే ఆ శాటిలైట్‌ను గమనిస్తూ ఉన్న శాస్త్రవేత్తలు దాని వల్ల భూమికి ఎటువంటి ప్రమాదం ఉండకపోవచ్చని భావిస్తున్నారు. రెస్సీ అనబడే ఈ సైన్స్ శాటిలైట్ త్వరలోనే ఆకాశంలో కనిపిస్తుందని నాసా చెప్తోంది. కానీ ఇప్పటికీ రెస్సీ భూమిపైకి ఎక్కడ నుండి ఎంటర్ అవుతుంది, ఎక్కడ పడుతుంది అనే విషయాలు ఇంకా తెలియలేదని తెలిపింది.

Advertisement

రెస్సీ శాటిలైట్ బరువు 660 పౌండ్లు అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అంటే 300 కిలోలు. ఈ శాటిలైట్ స్పేస్ నుండి భూమిపైకి వచ్చేలోపే కాలిపోతుందని శాస్త్రవేత్తలు భావించినా.. కొన్ని భాగాలు మాత్రం మిగిలిపోతాయని అనుకుంటున్నారు. దీని వల్ల భూమికి ఏర్పడే రిస్క్ శాతం తక్కువే అని వారు చెప్తున్నారు. రెస్సీ శాటిలైట్ పూర్తిపేరు ర్యూవెన్ రామాటీ హై ఎనర్జీ సోలార్ స్పెక్ట్రోస్కోపిక్ ఇమేజర్. ఇది 2002లో సూర్యుడిపై పరిశోధనలు చేయడానికి అంతరిక్షానికి ప్రయాణమయ్యింది.

2018లో కమ్యూనికేషన్ సమస్యల వల్ల రెస్సీ పనిచేయడం ఆగిపోయింది. అప్పటికే సూర్యుడి వెలుగు వల్ల రెస్సీ కొన్నిభాగాల్లో కాలిపోయిందని శాస్త్రవేత్తలు తెలిపారు. అప్పటివరకు ఇది హై ఎనర్జీతో ఉన్న ఎక్స్ రేస్‌ను, గామా రేస్‌ను ఫోటోలు తీసింది. దాదాపు లక్షకు పైగా సోలార్ ఈవెంట్లను క్యాప్చర్ చేసింది. రెస్సీ అనేది సూర్యుడి గురించి పరిశోధనలు చేసే విషయంలో నాసాకు చాలా సాయం చేసిందని శాస్త్రవేత్తలు గుర్తుచేసుకున్నారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×