E-Paper
Advertisement

Coronavirus Recovery : కరోనా తగ్గినా నీరసంగా ఉంటుందా?

Coronavirus Recovery : కరోనా తగ్గినా నీరసంగా ఉంటుందా?
Advertisement

Coronavirus Recovery : క‌రోనా నుంచి కోలుకున్న తర్వాత ఎక్కువ మంది నీరసంగా ఉంటున్నారు. కరోనా రోగ నిరోధక వ్యవస్థపై చాలా ప్రభావం చూపించింది. అందుకే ఈ సమస్య నుంచి బయటపడేందుకు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలని వైద్యులు అంటున్నారు. క‌రోనా నుంచి కోలుకున్నా నీరసంగా ఉంటే శక్తివంతమైన, పోషకాలు ఉన్న ఆహారం తినాలి, పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, పప్పుదినుసులు, బీన్స్‌లాంటివి ఎక్కువగా తీసుకోవాలి. దీనివల్ల శరీరం తిరిగి శక్తిని పొందుతుంది. అంతేకాకుండా విటమిన్లు, సీ,డీలతో పాటు జింక్‌, మినరల్స్‌ ఉండే ఆహారపదార్థాలు తీసుకోవాలి. దీంతో నీరసం తగ్గుతుంది. అంతేకాకుండా తేలికగా జీర్ణం అయ్యే ఆహారం తీసుకోవాలి.

ఎల్లప్పుడూ తాజా ఆహారపదార్థాలను తినాలి, సిట్రస్‌ జాతికి చెందిన పండ్లను తీసుకుంటే నీరసం తగ్గిపోతుంది. ఆరెంజ్‌ను ఎక్కువగా తినాలి. ప్రతిరోజు నట్స్‌ తినాలి. రాత్రి బాదంపప్పు నానబెట్టి ఉదయాన్నే తీసుకోవాలి. కిస్మిస్‌లు నానబెట్టి తినాలి, వాల్‌నట్స్‌, ఖర్జూరాలు కూడా తరచూ తినాలి. పోషకాహారంతో పాటుగా వ్యాయామం కూడా చేయాలని వైద్యులు చెబుతున్నారు. దీంతో రోగ నిరోధకశక్తి పెరుగుతుంది. ఉదయం త్వరగా నిద్రలేవాలి, రాత్రి తొందరగా పడుకోవాలని చెబుతున్నారు. దీని వల్ల శరీరంలో శక్తిస్థాయిలు పెరిగి ఉత్సాహంగా ఉంటారు.

Advertisement

అంతేకాకుండా బయటికి వెళ్లినప్పుడు మాస్క్‌లు ధరించాలి, భౌతికదూరం పాటించాలి. శ‌రీరంలో ఆక్సిజ‌న్ స్థాయి, ప‌ల్స్ రేట్‌, బీపీ ఎప్పుడూ చెక్‌చేసుకుంటుండాలి. షుగర్‌ ఉన్నవారు లెవల్స్‌ను కంట్రోల్‌లో ఉంచుకోవాలి.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×