E-Paper
Advertisement

Contact lens : నావిగేషన్ చూపించే స్మార్ట్ కాంటాక్ట్ లెన్స్

Contact lens : నావిగేషన్ చూపించే స్మార్ట్ కాంటాక్ట్ లెన్స్
Advertisement
Contact lens

Contact lens : 3డి బయోప్రింటింగ్ అనేది హెల్త్ సెక్టార్‌లో కీలకంగా మారింది. శరీర భాగాలను క్షుణ్ణంగా పరీక్షించడం కోసం ఇప్పుడు వైద్యులంతా ఈ 3డి బయోప్రింటింగ్‌నే ఉపయోగిస్తున్నారు. అంతే కాకుండా అవయవాలను కృత్రిమంగా తయారు చేయడానికి కూడా 3డి ఉపయోగపడుతుంది. తాజాగా ఈ టెక్నాలజీని ఉపయోగించి మరో అద్భుతాన్ని సృష్టించారు. అదే స్మార్ట్ కాంటాక్ట్ లెన్స్.

ఈరోజుల్లో ఐ సైట్ సమస్య అనేది కామన్ అయిపోయింది. దానికోసం కళ్లద్దాలు ఉపయోగిస్తున్నవారు కొందరైతే.. కాంటాక్ట్ లెన్స్ ఉపయోగిస్తున్న వారు మరికొందరు. ఇలాంటివన్నీ ఎందుకులే అని.. లేజర్ ట్రీట్మెంట్ చేయించుకుంటున్న వారు కూడా ఉన్నారు. ఒకప్పుడు కళ్లద్దాలకు ప్రాధ్యాన్యత ఇచ్చేవారు కూడా ఇప్పుడు కాంటాక్ట్ లెన్స్ వైపే మొగ్గుచూపుతున్నారు. ముఖ్యంగా యువతీయువకులు ఎక్కువశాతం ఈ కాంటాక్ట్ లెన్స్‌పై ఉపయోగపడుతున్నారు. 3డి ద్వారా కాంటాక్ట్ లెన్స్‌లో కొత్త ఫీచర్‌ను యాడ్ చేశారు పరిశోధకులు.

Advertisement

ఆగుమెంటెడ్ రియాలిటీ (ఏఆర్) సాయంతో స్మార్ట్ కాంటాక్ట్ లెన్స్‌లో ఒక కొత్త ఫీచర్‌ను యాడ్ చేశారు పరిశోధకులు. ఇలా తయారు చేయబడిన స్మార్ట్ కాంటాక్ట్ లెన్స్ కూడా ఇతర కాంటాక్ట్ లెన్స్‌లాగానే ఐ సైట్‌కు ఉపయోగపడుతుంది. దాంతో పాటు ఇది కావాల్సిన సమాచారాన్ని కూడా అందిస్తుంది. ఇప్పటికే ఈ విభాగంలో ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి. కానీ టెక్నికల్‌గా వచ్చే ఇబ్బందుల వల్ల ఈ స్మార్ట్ కాంటాక్ట్ లెన్స్ కమర్షియల్‌గా మార్కెట్లోకి రాలేకపోతోంది.

వోల్టేజ్‌ను ఉపయోగించకుండా 3డి ప్రింటర్ ద్వారా మైక్రో ప్యాటర్న్స్‌ను లెన్స్‌పై చేర్చడం ద్వారా ఇవి స్మార్ట్ కాంటాక్ట్ లెన్స్‌గా పనిచేస్తాయని పరిశోధకులు చెప్తున్నారు. ముఖ్యంగా బ్లూ కలర్‌లో ఈ స్మార్ట్ కాంటాక్స్ లెన్స్ తయారవుతున్నాయని వారు బయటపెట్టారు. ఈ స్మార్ట్ లెన్స్ ద్వారా కేవలం సమాచారం అందుకోవడం మాత్రమే కాదు.. నేవిగేషన్ కూడా సాధ్యమని పరిశోధకులు అంటున్నారు. అంతే కాకుండా స్మార్ట్ ఫోన్స్ లేకుండానే పోకీమాన్ గో లాంటి షోలు కూడా ఈ లెన్స్‌లో చూడవచ్చని తెలిపారు.

Advertisement

స్మార్ట్ కాంటాక్ లెన్స్‌పై పరిశోధనలు పూర్తయ్యి మార్కెట్లోకి వస్తే ఇది మెటీరియల్ సైన్స్‌లోనే సెన్సేషన్ సృష్టించగలదని పరిశోధకులు భావిస్తున్నారు. బ్యాటరీలు, బయోసెన్సార్లు తయారు చేసే కంపెనీలను స్మార్ట్ లెన్స్ ఐడియా ఆకర్షిస్తుందన్నారు. ఏఆర్ ఫీల్డ్‌లో కూడా ఇదొక కొత్త అధ్యాయనానికి దారితీస్తుందని తెలిపారు. ప్రభుత్వం కూడా ఈ రీసెర్చ్‌లో భాగమైతే బాగుంటుందని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×