E-Paper
Advertisement

Congress : రెబల్స్ కోసం నామినేటెడ్ అస్త్రం..?

Congress : రెబల్స్ కోసం నామినేటెడ్ అస్త్రం..?
Advertisement

మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార కాంగ్రెస్ పార్టీ కీలకనిర్ణయం తీసుకున్నది. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి అమెరికాలోనే ఉన్నారు. ఇవాళ రాత్రి లేదా రేపు సాయంత్రం వరకు ఆయన రాష్ట్రానికి రానున్నారు. ఈ క్రమంలోనే నిన్న మున్సిపల్ ఎన్నికలపై అమెరికా నుంచే జూమ్ కాల్‌లో సమీక్షించారు.ఇందులో కాంగ్రెస్ జిల్లా ఇన్చార్జి మంత్రులు, టీపీసీసీ చీఫ్, జిల్లా డీసీసీ అధ్యక్షులు పాల్గొన్నట్టు తెలిసింది. మున్సిపల్ ఎన్నికలకు పార్టీ చేస్తున్న కసరత్తు, తీసుకున్న నిర్ణయాలు, అభ్యర్థుల ఎంపిక, ప్రచార వ్యూహాలను ఇన్ చార్జి మంత్రులు, డీసీసీ అధ్యక్షులు సీఎం రేవంత్‌కు వివరించినట్టు సమాచారం.ఈ క్రమంలోనే ఆయన వారికి కీలక సూచనలు చేసినట్టు తెలిసింది.

మనమే గెలుస్తున్నాం..

మున్సిపల్ ఎన్నికల్లో ఈసారి కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు గెలుస్తుందని సీఎం రేవంత్ వారికి భరోసా ఇచ్చినట్టు తెలుస్తున్నది. క్షేత్రస్థాయిలో పార్టీకి మంచి పేరే ఉందని, ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకత ఉందని నిఘావర్గాలు ప్రభుత్వానికి రిపోర్టు ఇచ్చినట్టు తెలుస్తున్నది. ఎందుకంటే గులాబీ పార్టీ నేతలు ప్రస్తుతం వరుసగా సిట్ విచారణకు హాజరవుతున్నారు. బడా నేతలంతా విచారణల కోసం తిరుగుతుండటంతో వీరంతా ప్రచారానికి దూరమయ్యారు. ఫలితంగా కాంగ్రెస్ జోరుగా ప్రచారం చేస్తున్నది. మరోవైపు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు,అభివృద్ధి ఫలాల గురించి ఓటర్లకు వివరించి వారి నమ్మకాన్ని పొందడంలో కాంగ్రెస్ విజయవంతం అయ్యిందని నివేదికలు అందస్తున్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే జిల్లా ఇన్‌చార్జులు మరింత పనితనం చూపించాలని సీఎం వారికి సూచన చేసినట్టు టాక్.

వారిని బుజ్జగించండి..

Advertisement

మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 90శాతానికి పైగా సీట్లు సాధిస్తామని ధీమాతో ఉన్నది. అయితే, పార్టీ నమ్మకాన్ని రెబల్స్ దెబ్బకొట్టేందుకు సిద్ధమయ్యారు. టికెట్ ఆశించి భంగపడిన వారు రెబల్స్‌గా బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఈ విషయం కాస్త సీఎం దృష్టికి వెళ్లడంతో వారిని ఎలాగైనా నిలువరించాలని.. బుజ్జగించాలని, పోటీ నుంచి తప్పుకునేలా చేయాలని సీఎం రేవంత్.. జిల్లా నేతలకు సూచించనట్టు సమాచారం. ఎందుకంటే సర్పంచ్ ఎన్నికల సమయంలో రెబల్స్ వల్లే కాంగ్రెస్ గెలవాల్సిన స్థానాల్లో ఓట్లు చీలి ఆ స్థానాలను బీఆర్ఎస్ పార్టీ గెలుచుకున్నది. ఆ పరిస్థితి ఇప్పుడు రావొద్దని సీఎం రేవంత్ ఆదేశించినట్టు సమాచారం.

Stock Market: నిర్మల బడ్జెట్ వేళ.. భారీగా పతనమైన స్టాక్ మార్కెట్‌, 2300 పాయింట్లు కోల్పోయిన బీఎస్ఈ

చివరగా నామినేటెట్ అస్త్రం…

Advertisement

మున్సిపల్ ఎన్నికల్లో రెబల్స్‌గా బరిలోకి దిగకుండా అడ్డుకోవడానికి ముందుగా బుజ్జగించాలని.. వినకపోతే నామినేటెడ్ పోస్టుల్లో ప్రాధాన్యతనిస్తామని భరోసా కల్పించాలని సీఎం రేవంత్.. జిల్లా ఇన్‌చార్జి మంత్రులు, డీసీసీ అధ్యక్షులకు సూచించారు. అలా చేయడం వలన రెబల్స్ బెడద తగ్గుతుందని, ఫలితంగా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటుతుందని సీఎం ఆశాభావం వ్యక్తంచేసినట్టు సమాచారం. ఎన్నికల పై ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటున్న సీఎం.. పనితీరు బాగాలేని నేతలకు చెక్ పెట్టేందుకు సిద్ధం అవుతున్నట్టు సైతం ప్రచారం జరుగుతోంది. ముఖ్యమంత్రి ఈ ఎన్నికలు మంత్రులకు రిఫరెండంగా నిలుస్తాయని సైతం తెలుస్తోంది. ఇటీవల మంత్రి పొంగులేటి సైతం ఈ ఎన్నికలు మాకు రెఫరెండం అని పేర్కొన్న విషయం తెలిసిందే.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×