// // Coconut Water For Face - కొబ్బరి నీళ్లతో.. చర్మ సౌందర్యం రెట్టింపు -->
E-Paper
Advertisement

Coconut Water For Face: కొబ్బరి నీళ్లతో.. చర్మ సౌందర్యం రెట్టింపు

Coconut Water For Face: కొబ్బరి నీళ్లతో.. చర్మ సౌందర్యం రెట్టింపు
Advertisement

Coconut Water For Face: అమ్మాయిలు అందమైన, మెరిసే, స్పష్టమైన చర్మం కోసం ఖరీదైన స్కిన్ కేర్ ప్రొడక్ట్స్‌తో పాటు వివిధ రకాల హోం రెమెడీస్ కూడా వాడుతుంటారు. కానీ వీటన్నింటికి బదులుగా కొబ్బరి నీళ్లు మీ చర్మ సౌందర్యానికి చాలా బాగా ఉపయోగపడతాయి.ఇవి తాగడం వల్ల ప్రయోజనకరంగా ఉండటమే కాకుండా.. ముఖానికి అప్లై చేయడం వల్ల అనేక చర్మ సమస్యలు తొలగిపోతాయి. మీరు ప్రతిరోజూ మీ ముఖానికి కొబ్బరి నీళ్ళు అప్లై చేస్తుంటే మాత్రం.. మీ చర్మం ఆరోగ్యంగా ప్రకాశవంతంగా మారుతుంది. మరి గ్లోయింగ్ స్కిన్ కోసం కొబ్బరి నీళ్లు ముఖానికి ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

సహజ మెరుపు:
కొబ్బరి నీళ్లలో విటమిన్ సి , యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మం నుండి నీరసాన్ని తొలగించి సహజమైన మెరుపును ఇస్తాయి. అంతే కాకుండా తరచుగా కొబ్బరి నీళ్లతో ముఖానికి అప్లై చేయడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయి. ఇలా చేయడం వల్ల చర్మం తాజాగా, కాంతివంతంగా కనిపిస్తుంది.

Advertisement

మొటిమలు తగ్గుతాయి:
మీ చర్మం జిడ్డుగా ఉండి.. తరచుగా మొటిమలు వస్తుంటే మాత్రం కొబ్బరి నీళ్లు మీకు ఒక వరం లాంటివి. ఇవి యాంటీ బాక్టీరియల్ , యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి. అంతే కాకుండా మొటిమలను త్వరగా తగ్గించి, కొత్త మొటిమలు ఏర్పడకుండా నిరోధించడంలో సహాయపడుతుంది.

టానింగ్ , మచ్చలను తగ్గుతాయి:
తీవ్రమైన సూర్యకాంతికి గురికావడం వల్ల ముఖంపై ట్యానింగ్, నల్లటి మచ్చలు ఏర్పడతాయి. కొబ్బరి నీళ్లలో చర్మాన్ని కాంతివంతం చేసే గుణాలు ఉన్నాయి. ఇవి ముఖం నుండి ట్యాన్ తొలగించడంలో అంతే కాకుండా మచ్చలను నివారించడంలో సహాయపడతాయి.

Advertisement

పొడి చర్మం:
మీ చర్మం పొడిగా, నిర్జీవంగా అనిపిస్తే.. కొబ్బరి నీళ్లు దానిని హైడ్రేటెడ్ గా మారుస్తాయి. అంతే కాకుండా మృదువుగా చేస్తాయి. ఇందులో ఉండే సహజ ఖనిజాలు చర్మాన్ని లోతుగా తేమగా చేసి పొడిబారకుండా కాపాడుతాయి.

ముఖ రంధ్రాలు:
తెరిచి ఉన్న రంధ్రాలలో దుమ్ము, ధూళి త్వరగా పేరుకుపోయి ఇవి చర్మాన్ని దెబ్బతీస్తాయి. అంతే కాకుండా కొబ్బరి నీరు సహజ టోనర్‌గా పనిచేస్తుంది. ఇది తెరుచుకున్న ముఖ రంధ్రాలను బిగించి చర్మాన్ని మృదువుగా చేయడంలో సహాయపడుతుంది.

ముడతలు:
కొబ్బరి నీళ్లలో ఉండే యాంటీఆక్సిడెంట్లు ముఖంపై గీతలు, ముడతలను తగ్గించడంలో సహాయపడతాయి. ఇది చర్మం యొక్క స్థితిస్థాపకతను కాపాడుతుంది. అంతే కాకుండా చర్మాన్ని యవ్వనంగా, తాజాగా కనిపించేలా చేస్తుంది.

చర్మానికి చల్లదనం, ఉపశమనం:

వేసవిలో చర్మాన్ని చల్లగా , తాజాగా ఉంచడానికి కొబ్బరి నీళ్లు ఒక అద్భుతమైన పరిష్కారం. వీటిని ముఖానికి అప్లై చేయడం వల్ల చికాకు, ఎరుపు, వడదెబ్బ వంటి సమస్యలు తగ్గుతాయి.

Also Read: ఓ మై గాడ్.. 30 రోజులు టీ తాగకపోతే.. ఇన్ని లాభాలా ?

ఎలా ఉపయోగించాలి ?

కొబ్బరి నీళ్లలో దూదిని ముంచి, ముఖం అంతా సున్నితంగా అప్లై చేయండి.

10-15 నిమిషాలు అలాగే ఉంచండి. తరువాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోండి.

మంచి ఫలితాల కోసం దీన్ని రోజుకు రెండుసార్లు ఉదయం, రాత్రి ఉపయోగించండి.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×