E-Paper
Advertisement

Cholesterol Lowering Water : కొలెస్ట్రాల్‌ తగ్గించే వాము వాటర్‌

Cholesterol Lowering Water : కొలెస్ట్రాల్‌ తగ్గించే వాము వాటర్‌
Advertisement

Cholesterol Lowering Water : వాము.. రుచి, వాసనతో పాటు ఆరోగ్యాన్ని ఇస్తుంది. కడుపునొప్పిని తగ్గించడానికి ఈ వామును ఇంట్లో వాడుతారు. పిండి వంటలు, బజ్జీలు, కచోరీ, సమోసాలో చిటికెడు వాము కలుపుతారు. ఆయుర్వేదంలో వామును జీర్ణసమస్యలను దూరం చేయడానికి వాడుతారు. మలబద్ధకం, కడుపు నొప్పి, గ్యాస్‌, ఎసిడిటీతో బాధపడుతుంటే రోజూ ఉదయం ఖాళీ కడుపుతో వాము నీళ్లు తాగితే చాలా ఉపశమనం కలుగుతుంది. వాములో గ్యాస్ట్రిక్ యాసిడ్‌, జీర్ణక్రియను మెరుగుపరిచే ఎంజైమ్‌లు ఉన్నాయని ఓ అధ్యయనంలో తేలింది. జీర్ణక్రియ ఇన్ఫెక్షన్లను నివారించడానికి వాము నీళ్లు బాగా పనిచేస్తాయి. విరోచనాలు ఉంటే వాము నీళ్లను తాగితే మంచి ఫలితం ఉంటుంది. వాము జీర్ణశక్తిని మెరుగుపరిచి బాగా ఆకలి అయ్యేలా చేస్తుంది. చెడు కొలెస్ట్రాల్‌ స్థాయిలను కంట్రోల్‌లో ఉంచుతుంది. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో ఇది ప్రభావవంతంగా పని చేస్తుందని ఎలుకలపై చేసిన అధ్యయనంలో తేలింది.

ఈ వాము వాటర్‌ తాగితే గుండెకు ఎంతో మేలు చేస్తుంది. మంచి కొలెస్ట్రాల్‌ స్థాయి పెరుగుతుంది. ఇందులో ఉండే నియాసిన్ గుండె సంబంధిత సమస్యలు రాకుండా చూస్తుంది. కొద్దిగా వామును నీళ్లలో వేసి మరిగించి రోజూ ఉదయం తాగితే గుండె సంబంధిత వ్యాధులు రాకుండా ఉంటాయి. హైపర్‌టెన్షన్‌ ఉన్నవారు వాము నీళ్లు తాగితే బీపీ కంట్రోల్‌లో ఉంటుంది. ఇది గుండెలోకి కాల్షియం ప్రవేశించకుండా ఆపుతుంది. అంతేకాకుండా రక్త నాళాలను విస్తరిస్తుంది. ఊపిరితిత్తులు మెరుగ్గా పనిచేయడానికి వాము ఎంతో ఉపయోగపడుతుంది.

Advertisement

వామును ఒక వస్త్రంలో కట్టి వాసన పీలిస్తే జలుబు నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్‌లాంటి గుణాల వల్ల ఆస్తమా, దగ్గు నుంచి విముక్తి కలుగుతుంది. వాము నూనెను మౌత్‌ వాష్‌లు, టూత్‌ పేస్టుల్లో వాడుతారు. ఇది మన నోట్లోని బ్యాక్టీరియాతో పోరాడి దుర్వాసన రాకుండా చేస్తుంది. వామును నోట్లో వేసుకుని నమిలినా మంచి ఫలితం ఉంటుంది. శరీరంలో కొవ్వును కరిగించేందుకు కూడా వాము వాటర్‌ ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. స్థూలకాయం, అధిక బరువు సమస్యతో బాధపడేవారు ఆహారంలో వాము చేరుకుంటే మంచిది.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×