E-Paper
Advertisement

Artificial intelligence : ఏఐ విషయంలో చైనా పన్నాగం.. సిద్ధంగా ఉన్న అమెరికా..

Artificial intelligence : ఏఐ విషయంలో చైనా పన్నాగం.. సిద్ధంగా ఉన్న అమెరికా..
Advertisement

Artificial intelligence : చైనా అనేది ఇప్పుడు అన్ని రంగాల్లో దూసుకుపోతోంది. ముఖ్యంగా సైన్స్ అండ్ టెక్నాలజీ విషయంలో చైనా స్పీడ్ చూసి ఎన్నో అభివృద్ధి చెందిన దేశాలు సైతం ఆశ్చర్యపోతున్నాయి. అందుకే చైనా స్పీడ్‌ను అరికట్టడానికి ఎన్నో దేశాలు ప్రయత్నిస్తున్నాయి. అందులో ముందు పేరు అమెరికాదే ఉంటుంది. ప్రస్తుతం చైనాను అడ్డుకోవడం కోసం అమెరికా ఒక కొత్త వ్యూహంతో ముందుకెళ్తోంది. అంతే కాకుండా టెక్నాలజీ విషయంలో చైనాను వెనక్కి నెట్టాలని ప్రయత్నాలు మొదలుపెట్టింది.

చాట్‌జీపీటీ, ఏఐ లాంటి టెక్నాలజీలు అమెరికా టెక్నాలజీని అగ్రస్థానంలో నిలబెట్టాయి. అలాంటి టెక్నాలజీలనే తయారు చేయాలని చైనా కొన్ని నెలలుగా ప్రయత్నాలు చేస్తోంది. అయితే చైనా చేస్తున్న ఈ ప్రయత్నాలను అడ్డుకోవడం కోసం ఎన్నో కీలకమైన టెక్నాలజీలు తనకు అందుబాటులో ఉండకుండా చేయాలని అమెరికా ప్లాన్ చేస్తోంది. ప్రస్తుతం ప్రపంచదేశాలు అన్నింటిలో అమెరికానే ఏఐ రేసులో దూసుకెళ్తోంది. ఇంకే ఇతర దేశాన్ని అగ్రస్థానానికి రానివ్వకూడదని అనుకుంటోంది. అన్నింటికంటే ఎక్కువగా చైనానే అడ్డుకోవాలని చూస్తోంది.

Advertisement

టెక్నాలజీ విషయంలో అమెరికా ఏ దేశానికి అందకుండా దూసుకుపోతోందంటే అందులో చాలావరకు ముఖ్య పాత్ర పోషిస్తుంది సిలికాన్ వ్యాలి. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో టెక్నాలజీలను సప్లై చేస్తూ, కొత్త కొత్త టెక్నాలజీలను క్రియేట్ చేస్తూ సిలికాన్ వ్యాలి ముందుకెళ్తోంది. గూగుల్, యాపిల్, ఇంటెల్ లాంటి ఎన్నో ల్యాండ్‌మార్క్ టెక్నాలజీల తయారీ అక్కడే జరిగింది. ప్రస్తుతం అమెరికాను ఎదిరించాలంటే చైనాకు అలాంటి ఒక బేస్ కావాలి. అది అంత సులువుగా జరిగే పని కాదంటున్నారు టెక్ నిపుణులు.

అమెరికాతో పోలిస్తే చైనాకు కస్టమర్ల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న దేశంగా పేరొందిన చైనా.. ప్రపంచ నలుమూలలా ఉన్న కస్టమర్లకు తమ ప్రొడక్ట్స్‌ను అందిస్తోంది. అదే విధంగా టెక్నాలజీ విషయంలో కూడా లోకల్‌గా ఎన్నో కొత్త కొత్త యాప్స్‌ను క్రియేట్ చేసుకుంది. కాకపోతే అమెరికాతో పోలిస్తే చైనా అనేది ప్రైవసీ విషయంలో కాస్త తక్కువ జాగ్రత్తలే తీసుకుంటుందని నిపుణులు చెప్తున్నారు. ఈ ప్రైవసీ ఫ్యాక్టర్ అనేది అమెరికా కంటే చైనాను కాస్త వెనక్కితగ్గేలా చేస్తుందని భావిస్తున్నారు.

Advertisement

ఇన్ని విషయాల్లో చైనాకంటే అమెరికానే ముందంజలో ఉన్నా కూడా అమెరికాను దాటాలనే అంశాన్ని లక్ష్యంగా పెట్టుకుంది చైనా. కానీ అది ఎలా అనే విషయాన్ని మాత్రం బయటపెట్టడం లేదు. అందుకే చైనా సీక్రెట్‌గా అమెరికాను దాటడానికి తీవ్రమైన ప్రయత్నాలు మొదలుపెట్టిందని నిపుణులు భావిస్తున్నారు. ముఖ్యంగా ఏఐ విషయంలో అమెరికాను దాటాలని చైనా చాలా సీరియస్‌గా ప్రయత్నిస్తుందని వారు సందేహం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ రెండు దేశాల మధ్య జరిగే ఏఐ యుద్ధం ఎక్కడ, ఎలా ముగుస్తుందో అని ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×