E-Paper
Advertisement

China Aircraft : ల్యాండ్‌మార్క్ తాకిన చైనా.. గాలిలోకి 400వ ఎయిర్‌క్రాఫ్ట్..

China Aircraft : ల్యాండ్‌మార్క్ తాకిన చైనా.. గాలిలోకి 400వ ఎయిర్‌క్రాఫ్ట్..
Advertisement
China Aircraft

China Aircraft : సైన్స్ అండ్ టెక్నాలజీ విషయంలో ముఖ్యంగా స్పేస్ టెక్నాలజీ విషయంలో.. ఇతర దేశాలకు అందనంత ఎత్తుకు ఎదగాలని చైనా ప్రయత్నిస్తోంది. దానికోసం పూర్తిగా ప్రణాళిక కూడా సిద్ధం చేసి పెట్టుకున్నట్టుగా కనిపిస్తోంది. అందులో భాగంగానే ఈ ఏడాదిలో వరుసగా స్పేస్‌లోకి శాటిలైట్లను పంపించి ప్రయోగాలు చేయాలని నిర్ణయించుకుంది. తాజాగా అలాంటి ఒక అడ్వాన్స్ శాటిలైట్.. చైనా నేలపై నుండి అంతరిక్షంలోకి ఎగిరింది.

చైనా అకాడమీ ఆఫ్ స్పేస్ టెక్నాలజీ (కాస్ట్).. తియాన్హూ 6 ట్విన్ శాటిలైట్లను అంతరిక్షంలోకి పంపింది. తాజాగా వీటి లాంచ్ జరిగింది. లాంగ్ మార్చ్ 4సీ క్యారియర్‌పై నుండి ఈ రెండు శాటిలైట్లు ఆకాశంలోకి ఎగిరాయి. ఇవి జియోగ్రాఫిక్ మ్యాపింగ్, భూమిపై వనరులను సర్వే చేయడం, సైంటిఫిక్ పరిశోధనలు చేయడం లాంటి విషయాల్లో ఉపయోగపడుతుందని చైనా శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఇది చైనాకు చెందిన 400వ ఎయిర్‌క్రాఫ్ట్ కావడం విశేషం. సక్సెస్‌ఫుల్‌గా 400 ఎయిర్‌క్రాఫ్ట్స్‌ను గాలిలోకి పంపినందుకు చైనా సంతోషం వ్యక్తం చేస్తోంది.

Advertisement

ఎయిర్‌క్రాఫ్ట్స్‌ను గాలిలోకి పంపించే విషయంలో కాస్ట్‌కు సాయంగా నిలబడింది చైనా ఏరోస్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ కార్పొరేషన్ (కాస్క్). చైనాకు చెందిన మొదటి శాటిలైట్ డాంగ్‌ఫాంన్గ్‌హాంగ్-1 లాంచ్‌కు కూడా కాస్క్ ఎంతో సాయం చేసింది. దీంతో పాటు ఈ ఒక్క ఏడాదిలోనే దాదాపు 200 స్పేస్‌క్రాఫ్ట్స్‌ను 60 స్పేస్ మిషిన్ల ద్వారా అంతరిక్షంలోకి లాంచ్ చేయాలని కాస్క్ ప్లాన్ చేస్తోంది. అంతే కాకుండా లాంగ్ మార్క్ క్యారియర్ నుండి 500 ఫ్లైట్ మిషిన్ కూడా త్వరలోనే లాంచ్ అవ్వనుంది.

చైనా పేరు స్పేస్ టెక్నాలజీలో చరిత్ర సృష్టించాలంటే.. కొన్ని రిస్కులు తీసుకోవాలని ఆ దేశ ప్రభుత్వం నిర్ణయించుకుంది. అందుకే ఈ ఒక్క ఏడాదిలోనే మూడు ఫ్లైట్ మిషిన్లను లాంచ్ చేయనుంది. అవే టియాన్జో 6 కార్గో క్రాఫ్ట్, షెంజో 16, షెంజో 17 స్పేస్‌షిప్స్. ఇవి స్పేస్‌లోకి ఎంటర్ అవ్వడం, స్పేస్‌ను వినియోగించుకోవడం, స్పేస్‌ను గమనిస్తూ ఉండడం లాంటి విషయాల్లో చైనాను ముందుకు తీసుకెళ్తాయి. వీటితో పాటు బీడో-3 నేవిగేషన్ శాటిలైట్‌కు బ్యాకప్‌గా తయారైన మూడు శాటిలైట్లు కూడా ఈ ఏడాదిలోనే స్పేస్‌ను తాకనున్నాయి.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×