E-Paper
Advertisement

For Cancer Patients: క్యాన్సర్‌ రోగులకు మజ్జిగ ఓ వరం

For Cancer Patients: క్యాన్సర్‌ రోగులకు మజ్జిగ ఓ వరం
Advertisement

For Cancer Patients:మజ్జిగ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని అందరికీ తెలిసిందే. పెరుగు తినని వారు కూడా మజ్జిగ తాగుతూ ఉంటారు. మజ్జిగ సులభంగా జీర్ణం అవ్వడమే కాక ఆక్సిడెంట్ లక్షణాలు కలిగి ఉంటుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కడుపులో మంట తగ్గిస్తుంది.

రక్తహీనత తగ్గించి ఆకలిని నియంత్రిస్తుంది. ఇందులో ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, విటమిన్లు, ఎంజైమ్‌లు ఉంటాయి. అందుకని రోజు మజ్జిగను తాగుతూ ఉండాలి. మజ్జిగలో 90% నీరు ఉంటుంది. దీన్ని తాగడం వల్ల శరీరంలో ద్రవాలు సమతుల్యంగా ఉంటాయి. ఇతర శీతల పానీయాలు తాగడం కంటే మజ్జిగను తాగడం ఎంతో మంచిది. మజ్జిగ పుల్లని రుచిని కలిగి ఉంటుంది. ఇది శరీరానికి, కణజాలానికి పోషకాలను అందిస్తుంది. క్యాన్సర్ రోగులకు చికిత్స సమయంలో ఆహారంగా మజ్జిగ ఉపయోగపడుతుంది. క్యాన్సర్ చికిత్స ఒక వ్యక్తిని బలహీన పరుస్తుంది. దీనితో రోజువారి పనులు చేయలేరు. ఈ పరిస్థితిలో క్యాన్సర్ రోగికి మజ్జిగ చాలా బాగా పనిచేస్తుంది. క్యాన్సర్ చికిత్సకు వాడే మందుల వల్ల రోగులకు విరోచనాలు వస్తుంటాయి.

Advertisement

అయితే వాళ్లు మజ్జిగ తాగడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. వారి జీర్ణ వ్యవస్థ కూడా ఆరోగ్యంగా ఉంటుంది. కీమోథెరపీ రేడియేషన్ వల్ల జ్వరం, వాంతులు, విరోచనాలు అధికంగా అవుతుంటాయి. దీంతో పాటు డిహైడ్రేషన్ బారిన పడతారు. మజ్జిగ వల్ల ఈ సమస్యల నుంచి బయటపడవచ్చు అని నిపుణులు అంటున్నారు. మజ్జిగ తాగడం వల్ల శరీరానికి ఎలక్ట్రోలైట్స్ లభిస్తాయి. చురుకుదనం వస్తుంది. ఉత్సాహంగా పనిచేస్తారు. అందువల్ల క్యాన్సర్ రోగులు చికిత్స సమయంలో మజ్జిగ తీసుకుంటే ఎంతో మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×