E-Paper
Advertisement

Comments on Ktr: కేటీఆర్‌కు అర్బన్‌కు రూరల్‌కు తేడా తెలీదు..బీఆర్ఎస్ కార్యకర్తల షాకింగ్ కామెంట్స్..!

Comments on Ktr: కేటీఆర్‌కు అర్బన్‌కు రూరల్‌కు తేడా తెలీదు..బీఆర్ఎస్ కార్యకర్తల షాకింగ్ కామెంట్స్..!
Advertisement

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌ను సొంతపార్టీ కార్యర్తలే ట్రోలింగ్ చేస్తున్నారు. రీసెంట్‌గా కేటీఆర్ తాను రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో పర్యటిస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇదే విషయంలో ట్విట్టర్ స్పేస్‌లో మీటింగ్ పెట్టుకున్న బీఆర్ఎస్ కార్యకర్తలు ఆయనపై షాకింగ్ కామెంట్లు చేశారు. ఆయనకు అర్బన్‌కు రూరల్‌కు కూడా తేడా తెలియదు అంటూ రెచ్చిపోయారు. కేటీఆర్ అర్బన్ ప్రాంతం వరకు ఓకే కానీ ఆయనకు రూరల్ ప్రాంతం గురించి పెద్దగా తెలియదని అన్నారు. కేటీఆర్ మున్సిపాలిటీలు అన్నీ అర్బన్ అనుకుంటాడని, హైదరాబాద్ తప్ప మిగితా ప్రాంతాలు అర్బన్ కాదు అన్న విషయం ఆయనకు అర్థం కాదని, ఆయన అదో రకం అని ట్రోల్ చేశారు.

ఆయన చెన్నూరు పోయి జీడీపీనే మాట్లాడతాడు, గద్వాల పోయి జీడీపేనే మాట్లాడతాడు అంటూ ఎద్దేవా చేశారు. అన్నీ తానే మాట్లాడాలని అనుకుంటాడని ఎవ్వరికీ అవకాశం ఇవ్వడని విమర్శించారు. అంతే కాకుండా మాజీ మంత్రి హరీష్ రావును మెదక్‌కే పరిమితం చేశారని, ఆయనను కట్టడి చేస్తున్నారని వ్యాఖ్యానించారు. అయినప్పటికీ ఆయన 8 స్థానాలు గెలుపించుకున్నాడని అన్నారు. రూరల్ ప్రాంతాల్లో తిరగాలంటే కేసీఆర్ వెెళ్లాలని ఆయన వెళ్లనప్పుడు హరీష్ రావును పంపించాలని సూచించారు. కేటీఆర్ ముందు కొంతమంది భజన చేసేవాళ్లు ఉన్నారని వాళ్లు ఎవ్వరినీ కలవనివ్వరు అని అన్నారు.

Advertisement

ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో బీఆర్ఎస్ కార్యకర్తల నిజస్వరూపం ఇదే అంటూ నెటిజన్లు కౌంటర్లు ఇస్తున్నారు. అన్ననే విమర్శించే స్థాయికి ఎదిగారా..మిమ్మల్ని పార్టీ నుండే సస్పెండ్ చేయాలని కేటీఆర్ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. ఇదిలా ఉంటే బీఆర్ఎస్ కార్యకర్తలు హరీష్ రావు గురించి మాట్లాడిన మాటలు సంచలనం రేపుతున్నాయి. సాధారణంగా హరీష్ రావును పార్టీలో పెద్దగా హైలెట్ చేయరని, దూరంగా ఉంచుతారని ప్రతిపక్షాలు ఆరోపిస్తూ ఉంటాయి. కానీ సొంతపార్టీ కార్య‌క‌ర్త‌లు సైతం అవే కామెంట్లు చేయ‌డం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×