E-Paper
Advertisement

BRS Party: కార్పొరేషన్లపై ఎగరని గులాబీ జెండా.. 17 మున్సిపాలిటీలకే పరిమితం!

BRS Party: కార్పొరేషన్లపై ఎగరని గులాబీ జెండా.. 17 మున్సిపాలిటీలకే పరిమితం!
Advertisement

BRS Party:  మున్సిపల్ ఎన్నికల్లో సత్తాచాటేందుకు బీఆర్ఎస్ పార్టీ(BRS Party:) సర్వశక్తులు ఒడ్డింది. కానీ గెలుపు ముగింట బోల్తాపడింది. కేవలం 17 మున్సిపాలిటీలకు మాత్రమే పరిమితం అయింది. 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరుగగా ఒక్క కార్పొరేషన్ లో విజయం సాధించలేదు. అసెంబ్లీ సెగ్మెంట్ ఇన్ చార్జులపై వ్యతిరేకతతోనే గులాబీ ఆశించిన ఫలితాలు రాలేదని పార్టీలోనే ప్రచారం జరుగుతుంది. కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు, గ్యారంటీల్లో జరుగుతున్న జాప్యాన్ని వివరించినా ఓటర్లు విశ్వసించలేదని స్పష్టమవుతోంది.

రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగాయి. అందులో 2996 వార్డులు ఉన్నాయి. ఇందులో బీఆర్ఎస్ పార్టీ మున్సిపాలిటీల్లో 716 వార్డులు, కార్పొరేషన్లలో 63 డివిజన్లలో విజయం సాధించింది. మొత్తం 779 వార్డుల్లో విజయం సాధించింది. మొత్తం 17 మున్సిపాలిటిలకే పరిమితం అయింది. మెజార్టీ స్థానాల్లో విజయం సాధించాలని పార్టీ నేతలకు అధిష్టానం ఆదేశాలు సైతం జారీ చేసింది. కానీ కలిసి రాలేదు. మున్సిపల్ ఇన్ చార్జులుగా అసెంబ్లీ పార్టీ ఇన్ చార్జులకే బాధ్యతలు అప్పగించడం, వారే టికెట్ల విషయంలో కీలకంగా వ్యవహరించారు. వారు సూచించిన వ్యక్తులకే టికెట్లు ఇచ్చారు. మున్సిపాలిటీలకు ఇన్ చార్జులుగా నియమించినప్పటికీ మాజీ, తాజా ఎమ్మెల్యేలే కీ రూల్ పోషించారు. దీంతో వారిపై ఉన్న వ్యతిరేకతతోనే పార్టీ ఓటమికారణాలని పార్టీలోనే చర్చజరుగుతుంది. గతంలో పార్టీని నేతలు కలుపుకుపోవడం, పనిచేసిన నేతలకు గుర్తింపు ఇవ్వకపోవడం, పార్టీ అధిష్టానంకు పార్టీ కార్యకర్తలు ఫిర్యాదులు చేసినా పట్టించుకోకపోవడంతోనే పార్టీ ఓటమి కారణాలని పలువురు నేతలు అభిప్రాయపడుతున్నారు.

Advertisement

Also Read: Telangana Municipal Results: 64 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ క్లీన్ స్వీప్.. పార్టీల వారీగా గెలిచిన స్థానాలివే!

7 కార్పొరేషన్లలో వికసించని గులాబీ

ఏడు కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగాయి. కానీ ఏ ఒక్క కార్పొరేషన్ లోనూ విజయం సాధించలేకపోయింది. రామగుండం, నిజామాబాద్, మహబూబ్ నగర్, మంచిర్యాల, కరీంనగర్, నల్లగొండ, కొత్తగూడెం కార్పొరేషన్ లకు ఎన్నికలు జరిగాయి. ఇందులో ఒక మహబూబ్ నగర్ కార్పొరేషన్ లోనే 15 డివిజన్లలో విజయం సాధించింది. కొత్తగూడెంలో 60 డివిజన్లలో 8 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. అయితే సీపీఐకి మద్దతు ప్రకటిస్తుండటంతో కమ్యూనిస్టుపార్టీ కార్పొరేషన్ ను హంగ్ తో కైవసం చేసుకుంది.

విశ్వసించని ఓటర్లు

Advertisement

కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలలో జాప్యంను బీఆర్ఎస్ పార్టీ ఈ మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారం చేసింది. కరపత్రాలను సైతం పంపిణీ చేసింది. గడగడపకు వెళ్లారు. కానీ ప్రజలు మాత్రం విశ్వసించలేదని ఫలితాలు స్పష్టం చేశాయి. పార్టీ తెలంగాణ భవన్ నుంచి మానిటరింగ్ చేసి ఎప్పటికప్పుడు ఇన్ చార్జులకు సూచనలు చేసినా కలిసి రాలేదు. దీనికి తోడు పార్టీ అగ్రనేతలు సైతం రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేయలేదు. ఇది సైతం పార్టీ గెలుపుపై ప్రభావం పడిందని ప్రచారం జరుగుతుంది.

నాలుగు మున్సిపాలిటీల్లో ఖాతాతెరవలేదు

రాష్ట్రంలోని 123 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగగా 4 మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ పార్టీ ఖాతా తెరవలేదు. కోస్గి, మక్తల్, ధర్మపురి, భైంసా మున్సిపాలిటీల్లో ఒక స్థానంలో కూడా విజయం సాధించలేదు. ధర్మపురిలో 15 వార్డులు, కోస్గిలో 16 వార్డులు ఉండగా అన్నింటిలోనూ కాంగ్రెస్ క్లీన్ స్లిప్ చేసింది.

13 మున్సిపాలిటీల్లో సింగల్ డిజిట్

13 మున్సిపాలిటీల్లో గులాబీ పార్టీ సింగిల్ డిజిట్ కు పరిమితం అయింది. ఎల్లారెడ్డి, యాదగిరిగుట్ట, వడ్డేపల్లి, సుల్తానాబాద్, పెద్దపల్లీ, నందికొండ, మంథని, మధిర, కొడంగల్, హాలియా, చొప్పదండి, భూత్పూర్, ఆత్మకూర్ మున్సిపాలాటీల్లో ఒక్కోవార్డులోనే బీఆర్ఎస్ విజయం సాధించింది. పార్టీ బలంగా ఉందని చెబుతున్న అధిష్టానం.. క్షేత్రస్థాయిలోనూ అర్బన్ ప్రాంతాల్లోనూ పార్టీ ఏమేర బలంగా ఉందనేది ఈ ఎన్నికలుస్పష్టం చేశాయి. పార్టీకమిటీలు లేకపోవడం, స్థానిక నాయకత్వం సమన్వయ లోపం కారణంగానే ఈ ఫలితాలు అని పార్టీలో చర్చకు దారితీసింది.

Also Read: Kolikapudi Controversy: రోడ్లు లేవు.. ఉద్యోగాలు రావు! ఎమ్మెల్యే వాట్సాప్ స్టేటస్ వెనుక అసలు వ్యూహం ఇదేనా?

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×