E-Paper
Advertisement

Breast Feeding: డ్రీం ఫీడింగ్ గురించి తెలుసా?

Breast Feeding: డ్రీం ఫీడింగ్ గురించి తెలుసా?
Advertisement

Breast Feeding: కొత్తగా తల్లి అయిన మహిళకు బిడ్డే లోకం. ఉమ్మడి కుటుంబాలు అంతరించటంతో చిన్నారికి స్నానం మొదలు పాలివ్వటం వరకు ప్రతి పనిలోనూ తొలిసారిగా తల్లయిన వారికి ఇబ్బందే. ముఖ్యంగా నవజాత శిశువులు ఏ అర్థరాత్రో మేలుకుని ఏడవటం మొదలుపెడితే.. ఇక తెల్లారేదాకా ఆ తల్లికి నిద్ర లేనట్టే. ఆ సమయంలో బిడ్డకు పాలివ్వటమూ కాస్త కష్టంతో కూడుకున్న పనే. ఈ సమస్యలకు చెక్ పెడుతూ.. వైద్య నిపుణులు సూచిస్తున్న కొత్త పరిష్కారమే.. డ్రీమ్ ఫీడింగ్. అదేంటో తెలుసుకుందాం.

డ్రీం ఫీడింగ్ అంటే.. నిద్రలోనే బిడ్డకు పాలివ్వడం. సాధారణంగా రాత్రి 10 లేదా 11 గంటల వేళ బిడ్డ నిద్రలోకి జారుకోవటానికి ముందు పాలివ్వాలి. దీనివల్ల కనీసం 6 గంటల పాటు బిడ్డకు ఆకలి కాదు. దీంతో చిన్నారి ప్రశాంతంగా నిద్రించటం వీలవుతుంది.

Advertisement

డ్రీమ్ ఫీడింగ్‌కి అలవాటు చేసేందుకు ముందుగా.. బిడ్డను రోజూ ఒకే టైంలో నిద్రపుచ్చటం మొదలుపెట్టాలి. ఓ వారం రోజులకి బిడ్డ ఆ సమయానికి నిద్రపోయేందుకు అలవాటవుతాడు. ఆ సమయంలో తల్లి.. మెల్లగా బిడ్డ పక్కన పడుకుని బిడ్డకు చనుబాలివ్వాలి. ఆ సమయంలో బిడ్డను మెల్లిగా ఎత్తుకోవాలి. అయితే.. ఈ టైంలో గదిలో లైటు వేయటం గానీ, డైపర్ మార్చే ప్రయత్నం గానీ చేయొద్దు.

అయితే ఈ టెక్నిక్ తొలి వారంలోనే సక్సెస్ అవుతుందనే గ్యారెంటీ ఏమీ లేదు. కొందరిలో రెండు వారాలు కూడా పడుతుంది. దీనివల్ల అటు బిడ్డ, తల్లి ఇద్దరూ కంటినిండా నిద్రపోవటం సాధ్యమవుతుంది.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×