E-Paper
Advertisement

Brain Disease : అరుదైన మెదడు వ్యాధికి కారణమవుతున్న కోవిడ్..

Brain Disease : అరుదైన మెదడు వ్యాధికి కారణమవుతున్న కోవిడ్..
Advertisement

Brain Disease :కోవిడ్ మహమ్మారి అనేది ఒక్కొక్కరి జీవితంలో ఎలాంటి ప్రళయాలను సృష్టించిందో గుర్తుచేసుకున్నా కూడా చాలామంది ఆందోళనకు గురవుతారు. ఇప్పటికీ దీని వల్ల జరిగిన నష్టంతోనే జీవిస్తున్నారు చాలామంది. అయితే అప్పుడు మాత్రమే కాదు.. ఇప్పుటికీ కూడా కోవిడ్ అనేది ఏదో ఒక విధంగా ఎఫెక్ట్ చూపిస్తుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. కోవిడ్ అనేది భవిష్యత్తులో ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలకు దారితీసే అవకాశం ఉంటుందని తేల్చారు.

Advertisement

కోవిడ్ బారినపడి కూడా బయటపడిన వారు ఇప్పుడు సంతోషంగా జీవనం కొనసాగిస్తున్నారు. కానీ భవిష్యత్తులో ఎప్పుడో ఒకసారి వారికి భయంకరమైన ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు. తాజాగా కోవిడ్ వల్ల భవిష్యత్తులో బెల్ పాల్సీ అనే వ్యాధి సోకుతుందని వారు హెచ్చరిస్తున్నారు. బెల్స్ పాల్సీ అనేది ఒక అరుదైన వ్యాధి అని, ఇది సోకిన వారికి ఒకవైపు మొహం అంతా పక్షవాతానికి గురవుతుందని తెలిపారు.

చాలావరకు బెల్స్ పాల్సీ వచ్చిన పేషెంట్లు ఆరు నెలల్లో ఏ వైద్యం లేకుండానే మామూలు అయిపోతారని, చికిత్స తీసుకున్న వారు కూడా 90 శాతం ఆరోగ్యంగా బయటపడతారని శాస్త్రవేత్తలు అన్నారు. బెల్స్ పాల్సీని కార్టికో స్టెరాయిడ్స్‌తో నయం చేసే అవకాశం ఉంటుందని చెప్పారు. కోవిడ్ మాత్రమే కాదు.. కోవిడ్ వ్యాక్సిన్ కూడా బెల్స్ పాల్సీ వ్యాధికి దారితీస్తుందని తెలిపారు. అమెరికా, ఇరాన్‌కు చెందిన శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనల్లో ఈ విషయాలు బయటపడ్డాయి.

Advertisement

ఈ పరిశోధనలు నిజమా కాదా తెలుసుకోవడం కోసం శాస్త్రవేత్తలు దాదాపు 50 స్టడీలను చేశారు. కోవిడ్ వ్యాక్సిన్ అనేది అప్పట్లో చాలారకాలుగా అందుబాటులోకి వచ్చింది. కానీ వాటిలో అన్ని రకాలకు ఒకే విధమైన బాల్స్ పాల్సీ వ్యాధి సోకే అవకాశం ఉందని వారు అభిప్రాయ పడుతున్నారు. సార్స్ కోవ్ 2 ఇన్ఫెక్షన్ అనేది సార్స్ కోవ్ 2 వ్యాక్సినేషన్ కంటే ఎక్కువగా ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుందని, దాని వల్ల బీపీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తేల్చారు.

కోవిడ్ వ్యాక్సిన్స్‌తో పోలిస్తే సార్స్ కోవ్ 2 ఇన్ఫెక్షన్ వల్లే భవిష్యత్తులో ఎక్కువగా ఇబ్బందులు ఎదురవుతాయని శాస్త్రవేత్తలు బయటపెట్టారు. ఈ టైప్ వైరస్ సోకినవారు ఆరోగ్యంపై మరింత ఎక్కువగా జాగ్రత్త వహించాలని సూచించారు. సార్స్ కోవ్ 2 ఇన్ఫెక్షన్ వల్ల ఎన్నో న్యూరలాజికల్ వ్యాధులు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయన్నారు. అందుకే కోవిడ్ వల్ల భవిష్యత్తులో వచ్చే ఆరోగ్య సమస్యల గురించి శాస్త్రవేత్తలు క్షుణ్ణంగా పరిశోధనలు చేసి, దానికి పరిష్కారం కూడా కనిపెట్టాలని నిర్ణయించుకున్నారు.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×