E-Paper
Advertisement

Bosch AC: భారత ఏసీ మార్కెట్‌లో సంచలనం.. రంగంలోకి జర్మన్ కంపెనీ.. ఆసియాలోనే ఫస్ట్ టైమ్!

Bosch AC: భారత ఏసీ మార్కెట్‌లో సంచలనం.. రంగంలోకి జర్మన్ కంపెనీ.. ఆసియాలోనే ఫస్ట్ టైమ్!
Advertisement

Bosch AC: జర్మన్ దిగ్గజ సంస్థ బాష్ (Bosch).. భారత ఎయిర్ కండిషనర్ (AC) మార్కెట్లోకి నేరుగా అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం Hitachi (హిటాచీ) బ్రాండ్‌తో కొనసాగుతున్న ఈ సంస్థ.. త్వరలో ‘డ్యూయల్ బ్రాండ్’ (Dual brand) వ్యూహాన్ని అనుసరించాలని యోచిస్తోంది. అదే జరిగితే ఒకే కంపెనీ రెండు డిఫరెంట్ పేర్లతో ఏసీలు అందుబాటులోకి వచ్చే అవకాశముంది.

సొంత బ్రాండ్‌తో ఎంట్రీ

బాష్ హోమ్ కంఫర్ట్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సంజయ్ సుధాకరన్ తెలిపిన వివరాల ప్రకారం.. భారత్‌లో Bosch బ్రాండ్ పేరుతో ఏసీలను విడుదల చేసే ఆలోచన పరిశీలనలో ఉంది. అదే జరిగితే ఆసియా మార్కెట్లోనే Bosch బ్రాండ్ ఏసీలు రావడం ఇదే తొలిసారి కానుంది. ప్రస్తుతం ఈ బ్రాండ్ ఏసీలు యూరోప్, ఇతర పాశ్చాత్య దేశాల్లో మాత్రమే అందుబాటులో ఉండటం గమనార్హం.

హిటాచీ బ్రాండ్ కొనసాగింపు

Advertisement

అయితే Bosch సొంతంగా ఏసీలను తెచ్చినప్పటికీ.. హిటాచీ (Hitachi) బ్రాండ్ యథావిధిగా భారత్‌లో కొనసాగుతుందని తెలుస్తోంది. గతంలో చేసుకున్న దీర్ఘకాలిక లైసెన్స్ ఒప్పందం కారణంగా హిటాచీ బ్రాండ్ ను సైతం కొనసాగించాల్సి ఉంటుందని కంపెనీ వర్గాలు పేర్కొంటున్నాయి. దీని బట్టి చూస్తే భారత మార్కెట్ లో Bosch, Hitachi రెండు బ్రాండ్లూ అందుబాటులో ఉండే ఛాన్స్ ఉంది.

2026 కొత్త మోడళ్ల విడుదల

ఇదిలా ఉంటే బాష్ (Bosch) సంస్థ.. భారత్ లో తన హిటాచీ బ్రాండ్ ను మరింత విస్తరించేందుకు ప్రయత్నిస్తోంది. 2026 సంవత్సరానికి గాను 80కి పైగా కొత్త హిటాచీ ఏసీ మోడళ్లను భారత్‌లో ఆవిష్కరించింది. ఇవి 54 డిగ్రీల తీవ్ర ఎండలోనూ సమర్థవంతంగా గదులను చల్లబరుస్తాయని కంపెనీ వర్గాలు పేర్కొన్నాయి. 2026 మోడల్ ఏసీల్లో AI కూలింగ్, ఆక్టా సెన్సార్ టెక్నాలజీ (Octa Sensor Technology), 5 స్టార్ ఎనర్జీ ఎఫిషియెన్సీ వంటి అధునాతన ఫీచర్లను సైతం పొందుపరిచినట్లు తెలిపాయి. ప్రస్తుతం ఈ నయా మోడల్ హిటాచీ ఏసీలు.. యోషి (Yoshi), తౌషి (Toushi), ఐజెన్ (iZen) వంటి సిరీస్‌లలో లభిస్తున్నాయి.

Advertisement

Also Read: Smartphones 2026: మిడ్ రేంజ్ బడ్జెట్లో.. బెస్ట్ 5G స్మార్ట్ ఫోన్స్.. ప్రీమియం రేంజ్ ఫీచర్లు భయ్యా!

మార్కెట్ విస్తరణే లక్ష్యం

ప్రస్తుతం భారత ఏసీ మార్కెట్లో హిటాచీకి సింగిల్ డిజిట్ వాటా మాత్రమే ఉంది. దీనిని రాబోయే రోజుల్లో డబుల్ డిజిట్ కు తీసుకెళ్లాలని మాతృసంస్థ బాష్ భావిస్తోంది. వోల్టాస్, డైకిన్, బ్లూ స్టార్ వంటి అగ్రగామి సంస్థలకు పోటీనిస్తూ టాప్-3 స్థానాల్లో నిలవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం గత నాలుగేళ్లలో సుమారు రూ.500 కోట్లను పరిశోధన, అభివృద్ధి కోసం వెచ్చించడం గమనార్హం. భవిష్యత్తులో బాష్ బ్రాండ్ పేరుతో భారత్ లో అడుగుపెట్టడం ద్వారా ఏసీ మార్కెట్ లో వాటాను డబుల్ డిజిట్ కు పెంచుకోవాలని కంపెనీ యాజమాన్యం బావిస్తోంది.

Also Read: Budget Smartphones: రూ.20,000 బడ్జెట్‌లో.. తోపు స్మార్ట్ ఫోన్స్ భయ్యా.. ఫీచర్లు చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే!

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×