E-Paper
Advertisement

Blue Tick : బ్లూ టిక్.. ఇంకా లేట్..

Blue Tick : బ్లూ టిక్.. ఇంకా లేట్..
Advertisement

Blue Tick : వీలైనంత త్వరగా యూజర్ల నుంచి ఛార్జీలు వసూలు చేసి… పెట్టుబడిని రాబట్టుకోవాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్న ట్విట్టర్ కొత్త బాస్ మస్క్‌కు… పరిస్థితులు ఏ మాత్రం అనుకూలంగా లేనట్టు కనిపిస్తోంది. నెలకు 8 డాలర్ల రుసుముతో బ్లూ టిక్ సేవలు ప్రారంభించగానే… నకిలీ ఖాతాలు వెల్లువెత్తడంతో ఆ సేవల్ని తాత్కాలికంగా నిలిపివేశాడు… మస్క్. ఇప్పుడా వ్యవహారం ఇంకా ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

బ్లూ టిక్‌కు నెలకు 8 డాలర్ల ఫీజు ప్రకటించి, ఎలాంటి తనిఖీలు చేయకుండా… నవంబరు 6 నుంచి సేవలు ప్రారంభించాడు… మస్క్. అయితే… చాలా మంది ప్రముఖుల పేరుతో నకిలీ ఖాతాలు వెల్లువెత్తాయంటూ భారీగా ఫిర్యాదులు రావడంతో.. కొన్ని గంటల వ్యవధిలోనే ఆ సేవల్ని నిలిపివేశాడు. నవంబర్ 29 నుంచి బ్లూ టిక్ సేవల్ని పునరుద్ధరిస్తామని ఇటీవలే ప్రకటించాడు. కానీ… ఇప్పుడు మళ్లీ మాట మార్చాడు. బ్లూ టిక్ సేవల పునః ప్రారంభం మరింత ఆలస్యం కావొచ్చని ప్రకటించాడు. ఫేక్ అకౌంట్లను అరికట్టగలమని పూర్తి నమ్మకం కలిగాకే… బ్లూ టిక్ సేవల్ని తిరిగి అందుబాటులోకి తీసుకొస్తామని మస్క్ స్పష్టం చేశాడు. అలాగే సంస్థలకు ఇచ్చే వెరిఫికేషన్‌ బ్యాడ్జ్‌ రంగును కూడా మార్చే అవకాశం ఉందని… పర్సనల్ యూజర్లు, కంపెనీల అకౌంట్లకు స్ఫష్టమైన తేడా ఉండేలా చూస్తామన్నాడు.

Advertisement

భారీ సంఖ్యలో ఉద్యోగుల తొలగింపే… మస్క్ అనుకున్న పనులు సకాలంలో పూర్తికాకపోవడానికి కారణమనే ప్రచారం జరుగుతోంది. కీలక ఉద్యోగుల్ని ఇష్టానుసారం పీకేయడంతో… వాళ్ల స్థానాన్ని భర్తీ చేసే వాళ్లు లేక… పనులన్నీ ఎక్కడివక్కడే పెండింగ్ లో పడిపోతున్నాయని అంటున్నారు. అందుకే… బ్లూ టిక్ సేవల ప్రారంభాన్ని కూడా వాయిదా మీద వాయిదా వేసుకుంటూ పోతున్నాడని చెబుతున్నారు. కానీ ఇవేవీ పట్టించుకోని మస్క్… గత వారం ట్విట్టర్ కొత్తగా 16 లక్షల మంది యూజర్లను సాధించిందనీ, ఇది ‘మరో ఆల్ టైమ్ హై’ అని సంబరపడుతూ ట్వీట్ చేశాడు.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×