E-Paper
Advertisement

Blood Group And Food : మీ బ్లడ్ గ్రూప్ ప్రకారం ఫుడ్.. చికెన్, మటన్‌లో ఏది తినాలి..!

Blood Group And Food : నాన్‌వెజ్ అంటే మన అందరికి ఎంతో ఇష్టం. ఇక చికెన్, మటన్ అంటే ఇష్టపడని వారుండరు. కానీ మన బ్లడ్ గ్రూప్‌ను బట్టి ఆహారాన్ని తీసుకోవాలంట. ఈ బ్లడ్ గ్రూప్ ఆధారంగా మనం ఆహారం తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. లేదంటే శారీరక సమస్యలు పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

Blood Group And Food : మీ బ్లడ్ గ్రూప్ ప్రకారం ఫుడ్.. చికెన్, మటన్‌లో ఏది తినాలి..!
Advertisement

Blood Group And Food : నాన్‌వెజ్ అంటే మన అందరికి ఎంతో ఇష్టం. ఇక చికెన్, మటన్ అంటే ఇష్టపడని వారుండరు. కానీ మన బ్లడ్ గ్రూప్‌ను బట్టి ఆహారాన్ని తీసుకోవాలి. ఈ బ్లడ్ గ్రూప్ ఆధారంగా మనం ఆహారం తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. లేదంటే శారీరక సమస్యలు పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

1996లో ‘ఈట్ రైట్ ఫర్ యువర్ టైప్’ అనే పుస్తకంలో వైద్యుడు డాక్టర్ ర్టీటర్ డి ఏ బ్లడ్ గ్రూప్ వారు ఎటువంటి ఆహారం తినాలో వివరించారు. అలా తినకుంటే మనం ఇష్టంగా తినే చికెన్, మటన్ సరిగా అరగదంట. కొన్ని బ్లడ్ గ్రూపుల వారికి గుండె జబ్బులు త్వరగా వచ్చే అవకాశం కూడా ఉంది. అయితే మొత్తం నాలుగు (O, A, B, AB) బ్లడ్ గ్రూపులు ఉన్నాయి. ఏ బ్లడ్ గ్రూప్ వారు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసుకుందాం.

Advertisement

A పాజిటివ్ లేదా నెగిటివ్ బ్లడ్ గ్రూపుల వారిని A బ్లడ్ గ్రూప్ వ్యక్తులు అంటారు. వీరికి రోగనిరోధక శక్తి చాలా సున్నితంగా ఉంటుంది. కాబట్టి ఈ బ్లడ్ గ్రూప్ వారు ఆహారంపై ఎక్కువ శ్రద్ధ చూపాలి. వీరు ఎక్కువగా శాఖాహారం తీసుకుంటే మంచిది. చికెన్ లేదా మటన్ తక్కువగా తినాలి. మాంసాహారాన్ని సులభంగా జీర్ణించుకోలేరు. మాంసాహారం ద్వారా శరీరంలో చేరే బ్యాక్టీరియాను వీరు తట్టుకోలేరు. సీ ఫుడ్ జీర్ణమయ్యేందుకు సులభంగా ఉంటుంది.

B పాజిటివ్ లేదా నెగిటివ్ బ్లడ్ గ్రూపుల వారిని B బ్లడ్ గ్రూప్ వ్యక్తులు అంటారు. వీరికి రోగనిరోధక శక్తి పుష్కలంగా ఉంటుంది. వీరు చికెన్, మటన్ హాయిగా తినొచ్చు. ఏ మాంసాహారమైన జీర్ణించుకోగలరు. ఈ గ్రూప్ వారు తీసుకునే ఆహారంలో కూరగాయలు, పండ్లు, చేపలు ఉండేలా చూసుకోవాలి. గోధుమలు, టమోటాలు, నువ్వులు తినడం తగ్గించాలి

Advertisement

0 పాజిటివ్ లేదా నెగిటివ్ బ్లడ్ గ్రూపుల వారిని 0 బ్లడ్ గ్రూప్ వ్యక్తులు అంటారు. వీరు చికెన్, మటన్ ఎక్కువగా తినొచ్చు. గుడ్లు, సీఫుడ్ కూడా ఎటువంటి సమస్య లేకుండా జీర్ణం అవుతుంది. ఆకుకూరలు, పాలు, ధాన్యాలు కూడా తినొచ్చు.

AB పాజిటివ్ లేదా నెగిటివ్ బ్లడ్ గ్రూపుల వారు సీ ఫుడ్‌ను ఎక్కువగా తీసుకోవాలి. చికెన్, మటన్‌కు దూరంగా ఉండటం మంచిది. ఈ బ్లడ్ గ్రూపు కలిగిన వారి కడుపులో ఆమ్లాలు తక్కువగా ఉంటాయి. ఆల్కహాల్, కెఫిన్‌ తీసుకోకూడదు.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×