E-Paper
Advertisement

BJP Leaders: బీజేపీలో కేటీఆర్ చిచ్చు, రెండుగా చీలిన నేతలు

BJP Leaders: బీజేపీలో కేటీఆర్ చిచ్చు, రెండుగా చీలిన నేతలు
Advertisement

BJP Leaders: తెలంగాణ బీజేపీలో కారు పార్టీ చిచ్చు రేపిందా? కేటీఆర్ వ్యవహారం ఆ పార్టీలో నేతల మధ్య చిచ్చు రాజేసిందా? లగచర్ల దాడి కేసులో కేటీఆర్‌ను అరెస్ట్ చేయాలని ఒకరంటే.. ప్రభుత్వానిదే తప్పని మరొకరు ఎందుకంటున్నారు? ఆ పార్టీ రెండుగా చీలిందనే వాదన ఊపందుకుందా? అవుననే అంటున్నారు కొందరు రాజకీయ నేతలు.

అధికారంలో లేనప్పుడు కేంద్రమంత్రుల అపాయింట్‌మెంట్ విపక్షాలకు దొరకడం కాస్త కష్టంగానే ఉంటుంది. కాకపోతే ఆ పార్టీలో ఎవరో ఒకరుంటే మరింత ఈజీగా కేంద్రమంత్రులను కలిసే అవకాశం ఉంటుంది.

Advertisement

రీసెంట్‌గా కేటీఆర్ ఢిల్లీకి వెళ్లారు. ఆయన ఢిల్లీకి వెళ్లిన వెంటనే కేంద్రమంత్రితో సమావేశం కావడం, ఆపై సాయంత్రానికి మీడియా ముందుకు రావడం, రాత్రి వేళ బీజేపీ అగ్రనేతలను కవడం చకచకా జరిగిపోయింది.

ఈ పరిణామాలు వెనుక బీజేపీ ఎంపీ ఒకరున్నారని, ఆయన సహకారంతో ఇదంతా జరిగిందని అంటున్నారు. ఢిల్లీకి కేటీఆర్ వెళ్లగానే నేరుగా ఆ ఎంపీతో కాసేపు మంతనాలు జరిపారని అంటున్నారు. కేంద్రమంత్రి ఆఫీసులో ఆయనతో ఫోటోలు కూడా దిగారట.

Advertisement

ALSO READ: హైదరాబాద్‌లో ట్రాఫిక్ నియంత్రణ.. రంగంలోకి ట్రాన్స్‌జెండర్లు

గతంలో కేసీఆర్ స్వయంగా ఆయన్ని బీజేపీలోకి పంపారనే వాదనలూ లేకపోలేదు. జరుగుతున్న పరిణామాలను గమనించిన తెలంగాణ కాంగ్రెస్ నేతలు, ఈ రెండు పార్టీల మధ్య చీకటి ఒప్పందం జరిగిందని, ఈ రెండు పార్టీలు ఒక్కటేనని విమర్శలు గుప్పించారు. లోక్‌సభ ఎన్నికల నుంచి తాము ఇదే చెబుతున్నామని, చివరకు అదే నిజమైందని అంటున్నారు.

లేటెస్ట్‌గా లగచర్ల దాడి కేసులో కూడా తెలంగాణ బీజేపీ నేతలు రెండుగా చీలిపోయినట్టు కనిపిస్తోంది. ఈ ఘటనలో కేటీఆర్‌ను జైలుకి పంపించాలని ఎంపీ అర్వింద్ ప్రస్తావించారు. మరో ఎంపీ ఈటెల మాటలు బీఆర్ఎస్ వత్తాసు పలికేలా ఉన్నాయి. దీంతో తెలంగాణ బీజేపీ రెండువర్గాలు చీలిపోయిందని చర్చ పొలిటికల్ సర్కిల్స్‌లో జోరుగా సాగుతోంది.

మూసీ పునరుజ్జీవన, హైడ్రా విషయంలో తెలంగాణ బీజేపీ నేతలు రెండుగా చీలిపోయిన విషయం తెల్సిందే. బీజేపీలో ఓ వర్గం బీఆర్ఎస్‌కు సపోర్టు చేయగా, మరో వర్గం అధికార ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించింది.

బీజేపీ-బీఆర్ఎస్ ఒకటేనన్న ప్రచారాన్ని తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్షుడు కిషన్‌రెడ్డి. కాంగ్రెస్-బీఆర్ఎస్ ఒక్కటేనంటూ ఆయన కొత్త పల్లవిని ఆయనెత్తుకున్నారు. ఈ డ్యామేజ్‌ని నివారించకుంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీకి తీవ్ర నష్టం కలిగే అవకాశముందని కొందరు బీజేపీ నేతల మాట.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×