E-Paper
Advertisement

Bhatti Vikramarka: విద్యుత్ ఉద్యోగుల స‌మ‌స్యల ప‌రిష్కారానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది : భ‌ట్టి విక్రమార్క

Bhatti Vikramarka: విద్యుత్ ఉద్యోగుల స‌మ‌స్యల ప‌రిష్కారానికి ప్రభుత్వం సిద్ధంగా  ఉంది : భ‌ట్టి విక్రమార్క
Advertisement

Bhatti Vikramarka: తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ : విద్యుత్ ఉద్యోగుల స‌మ‌స్యల ప‌రిష్కారానికి ప్రజాప్రభుత్వం సిద్ధంగా ఉంద‌ని ఉప ముఖ్యమంత్రి భ‌ట్టి విక్రమార్క తెలిపారు. మహాత్మా జ్యోతిరావు ఫూలే ప్రజాభ‌వ‌న్ లో ఎస్సీ, ఎస్టీ ఎల‌క్ట్రిసిటీ ఎంప్లాయిస్ డైరీని ఉప ముఖ్యమంత్రి బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా క‌ల్పించిన రిజ‌ర్వేష‌న్‌ హ‌క్కుల వ‌ల్ల ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీల‌కు ప్రయోజ‌నం చేకూరుతోందన్నారు. ఆయా వ‌ర్గాల హ‌క్కుల‌ను కాపాడ‌డం కోసం సంఘాలను న‌డిపిస్తున్న అందరికీ హృద‌య పూర్వకంగా అభినందిస్తున్నట్లు డిప్యూటీ సీఎం పేర్కొన్నారు.

Also Read:

ప్రజా ప్రభుత్వం వాటిని ప‌రిష్కరించేందుకు సిద్ధం

Advertisement

భ‌విష్యత్ లో సంఘాల‌కు, ఉద్యోగ‌స్తుల‌కు ఎలాంటి స‌మ‌స్యలు, ఇబ్బందులు వ‌చ్చినా ప్రజా ప్రభుత్వం వాటిని ప‌రిష్కరించేందుకు సిద్ధంగా ఉంద‌ని చెప్పారు. స‌మ‌స్యల ప‌రిష్కారానికి తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని చెప్పారు. గ‌త ప్రభుత్వం ఉద్యోగులు, సంఘాల సమస్యలను ఏమాత్రం ప‌ట్టించుకోలేదన్నారు. అదే ప్రజా ప్రభుత్వంలో స‌మ‌స్యల‌ను తమ దృష్టికి తీసుకువస్తే వాటి ప‌రిష్కారం కోసం ప‌నిచేస్తున్నట్లు భట్టి పేర్కొన్నారు.

ఉద్యోగులు, సంఘాల‌పై కాంగ్రెస్ ప్రభుత్వం ఏనాడూ త‌మ అభిప్రాయాల‌ను రుద్దలేదన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు వేముల వీరేశం, డాక్టర్ క‌వ్వంప‌ల్లి స‌త్యనారాయ‌ణ‌, మాజీ ఎమ్మెల్సీ రాజేశ్వర్, అసొసియేన్ ఫౌండ‌ర్, సెక్రటరీ జనరల్ మాతంగి శ్రీనివాస్, వ‌ర్కింగ్ సెక్రెట‌రీ పీఎం రాజు, జెన్ కో, ట్రాన్స్ కో, ఎన్ పీడీసీఎల్, ఎస్పీడీసీఎల్ ఉద్యోగ సంఘాల నాయ‌కులు పాల్గొన్నారు.

Advertisement

Also ReadBhatti Vikramarka: బుద్ధుడు, అంబేద్క‌ర్ మార్గంలో మా పాల‌న కొన‌సాగుతుంది : ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క‌

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×