E-Paper
Advertisement

Banana Leaf : అరటి ఆకులో తింటే ఎలాంటి ప్రయోజనాలున్నాయి

Banana Leaf : అరటి ఆకులో తింటే ఎలాంటి ప్రయోజనాలున్నాయి
Advertisement

Banana Leaf : పాతరోజుల్లో ఎవరైనా అతిథులు ఇంటికి వస్తే అరటి ఆకులో వడ్డించేవారు. పెళ్లిళ్లలో, శుభకార్యాల్లో అరటి ఆకుల్లోనే తినేవారు. వాపులు, గుండెజబ్బులు, క్యాన్సర్‌, అల్జీమర్స్‌లాంటి వ్యాధులను నియంత్రించే శక్తి అరటాకులకు ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. అరటి ఆకులో వృక్ష సంబంధ వర్ణద్రవ్యం రూటిన్‌ ఉంటుంది. ఇది షుగర్‌ను అదుపులో ఉంచడంతో పాటు ఎన్నో రకాల వ్యాధులను దరిచేరనివ్వదు. అరటిలోని యాంటీ ఆక్సిడెంట్లు జలుబును తగ్గిస్తాయి. వీటిలోని ఫైటో కెమికల్స్‌ జ్వరాన్ని కూడా తగ్గించడంలో బాగా పనిచేస్తాయి. అందుకే ఎప్పుడూ అరటాకు కషాయం తాగాలని పెద్దలు చెబుతారు. పెట్రోలియం జెల్లీతో కట్టే గాజు కట్టుకు బదులు గాయాలకు అరటి ఆకుతో కట్టుకడితే అంతే ప్రయోజనాలు ఉంటాయి. ఈ ఆకులోని యాంటీమైక్రోబియల్‌, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు గాయాలను సహజరీతిలో తగ్గిస్తాయి. చర్మం మీద సెల్యులైటిస్‌ అనే ఇన్ఫెక్షన్‌ను తగ్గించడంలో అరటి ఆకు పసరు బాగా పనిచేస్తుంది. తెల్లజుట్టు, చుండ్రును తగ్గించేందుకు అరటి ఆకు రసం బాగా పనిచేస్తుంది. తలకు ఇది పెడితే దురద తగ్గి, కేశాలు నల్లగా మారుతాయి. అల్సర్లను తగ్గించడంలో అరటాకు సమర్థంగా పని చేస్తుంది. దీనిలోని ఫ్లేవనాయిడ్లు, ఆల్కలాయిడ్లు, టానిన్లు, ఫినోలిక్‌ యాసిడ్లు, యాంటీ ఆక్సిడెంట్లు గాయాలను తగ్గిస్తాయి. కొన్ని ప్రాంతాల్లో పాము కరిచిన చోట అరటాకు ముద్ద పూస్తారు. ఇందులోని టానిల్స్‌, పాలీఫినాల్స్‌ విషపూరిత ప్రొటీన్లను పనిచేయకుండా చేస్తాయి. అంతేకాకుండా రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×