E-Paper
Advertisement

Ather 450x: సరికొత్త ఫీచర్లు, రంగుల్లో ఏథర్‌ 450x

Ather 450x: సరికొత్త ఫీచర్లు, రంగుల్లో ఏథర్‌ 450x
Advertisement

Ather 450x: ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్ల సంస్థ ఏథర్ ఎనర్జీ… కొత్త స్కూటర్‌ను మార్కెట్లోకి లాంచ్ చేసింది. ఏథర్‌ కమ్యూనిటీ డే పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో… 450x మోడల్ స్కూటర్‌ను కొత్త ఫీచర్లు, రంగుల్లో ఆవిష్కరించింది. ఇందులో సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌తో పాటు, సీటింగ్‌లోనూ మార్పులు చేసింది. నాలుగు కొత్త రంగుల్లోనూ స్కూటర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ట్రూ రెడ్‌, కాస్మిక్‌ బ్లాక్‌, సాల్ట్‌ గ్రీన్‌, లునార్‌ గ్రే రంగుల్లో 450x రాబోతోంది.

ఏథర్‌ స్టేక్‌ 5.0 పేరుతో సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ తీసుకొచ్చిన సంస్థ… టచ్‌ స్క్రీన్‌ యూజర్‌ ఇంటర్‌ఫేస్‌లోనూ కొన్ని మార్పులు చేసింది. కొత్త 450xలో యూజర్‌ తనకు నచ్చిన ఆప్షన్స్‌ను పెట్టుకోవచ్చు. గూగుల్‌తో కలిసి తీసుకొచ్చిన వెక్టార్‌ మ్యాప్ ద్వారా… నావిగేషన్‌తో పాటు లైవ్‌ ట్రాఫిక్‌ను కూడా చూడొచ్చు. ఇది వినియోగదారులకు అచ్చంగా మొబైల్ మ్యాప్ అనుభూతినే కలిగిస్తుందని ఏథర్ ధీమాగా చెబుతోంది. అంతేకాదు… ఆటో హోల్డ్‌ ఫంక్షన్‌ లేదా హిల్‌ హోల్డ్‌ ఫంక్షన్‌ ఫీచర్‌నూ ప్రవేశ పెట్టింది. దీన్ని ఉపయోగిస్తే… ఎత్తు లేదా పల్లం ప్రాంతాల్లో స్కూటర్‌ వెనక్కి లేదా ముందుకు వెళ్లకుండా ఉంటుంది.

Advertisement

ఇక పొడవుగా ఉండే వ్యక్తులకు కూడా అనువుగా ఉండేలా… సీటులోనూ మార్పులు చేశారు. ఎక్స్‌టెండెడ్‌ వారెంటీ ప్రోగ్రాంలో భాగంగా… ఇప్పుడున్న మూడేళ్లు స్టాండర్డ్‌ వారెంటీకి అదనంగా… మరో 2 ఏళ్లు వారెంటీ పొడిగించారు. ఇకపై కొత్తగా ఏథర్‌ను కొనుగోలు చేసే వారికి 5 ఏళ్ల స్టాండర్డ్‌ వారెంటీ లభిస్తుంది. కాస్త అదనపు రుసుముతో పాత యూజర్లు కూడా 2 ఏళ్లు వారంటీని పొడిగించుకునే అవకాశం కల్పించారు. అంతేకాదు… ఏథర్‌ 450x ఫస్ట్‌ జనరేషన్‌ స్కూటర్‌ను కొని మూడేళ్లు దాటితే… దాన్ని మార్చుకునే అవకాశమూ ఇచ్చారు. రూ.90 వేలు చెల్లించడంతో పాటు పాత స్కూటర్‌ను ఎక్స్ఛేంజ్ చేసుకోవడం ద్వారా… కొత్త స్కూటర్‌ను వినియోగదారులు సొంతం చేసుకోవచ్చు.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×