E-Paper
Advertisement

Artificial intelligence war : ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వార్.. చాట్జీపీటీకి పోటీగా ఎలన్ మస్క్ జీపీటీ

Artificial intelligence war : ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వార్.. చాట్జీపీటీకి పోటీగా ఎలన్ మస్క్ జీపీటీ
Advertisement
Artificial intelligence war

Artificial intelligence war : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటేనే హైయెస్ట్ ఇంటెలెక్చువల్. ఇంకా పూర్తి స్థాయిలో రెడీ అవలేదు గానీ… అలా రెడీ అయితే మానవ మేథస్సును మించిపోతుంది. మానవ మేథస్సును మించిపోయే అలాంటి ఏఐలు ఇంకా ఇంకా పుట్టుకొస్తే. ఇప్పుడు అదే ప్రయత్నం జరుగుతోంది. కంపెనీకో చాట్ జీపీటీ, ఎవరికి వాళ్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్రియేషన్.

ఇప్పటికే, మైక్రోసాఫ్ట్ తయారుచేసిన చాట్ జీపీటీ సంచలనం సృష్టిస్తోంది. మైక్రోసాఫ్ట్‌కు పోటీగా గూగుల్ చాట్‌బర్డ్ తీసుకొచ్చింది. ఆల్రడీ చైనా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రెడీ చేస్తోంది. వీళ్లందరినీ కాదని ఇప్పుడు ఎలన్ మస్క్ కూడా కొత్త ఏఐ తయారీకి రెడీ అయ్యారు.

Advertisement

చాట్ జీపీటీకి పోటీగా తన సొంత ఏఐకి ట్రూత్ జీపీటీ లాంచ్ చేయనున్నట్లు అనౌన్స్ చేశారు. మస్క్ కంపెనీ తయారు చేయబోయే ఏఐ.. నేచర్‌ను కూడా అర్థం చేసుకుని, దానికి అనుగుణంగా పనిచేస్తుందని చెబుతున్నారు. అదే జరిగితే.. అచ్చం మనిషి స్పందించేటట్లే స్పందిస్తుంది. అయితే, తమ ట్రూత్ జీపీటీ వల్ల మానవాళికి ఎలాంటి ముప్పు ఉండదని మస్క్ హామీ ఇస్తున్నారు. ఫాక్స్‌ న్యూస్‌ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మస్క్‌.. ట్రూత్ జీపీటీ గురించి చెప్పుకొచ్చారు. ట్రూత్‌జీపీటీ పేరుతో ఏఐ చాట్‌బాట్‌ తీసుకురాబోతున్నామని వివరించారు.

అయితే, ఎవరెన్ని చెప్పినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో మానవాళికి ముప్పు తప్పదని హెచ్చరిస్తున్నారు. నాగరిక సమాజ భవిష్యత్తుకు ఏఐ అతిపెద్ద ప్రమాదం అని గూగుల్‌ సీఈవో సుందర్ పిచాయ్ చెప్పుకొచ్చారు. ఈ ప్రమాదం నుంచి త‌ప్పుకోవాలంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీపై నియంత్రణ ఉండాల్సిందేన‌ని తేల్చి చెప్పారు. 

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×