E-Paper
Advertisement

Artificial Intelligence Capabilities: మ్యూజిక్ ఇండస్ట్రీలో ఏఐ అడుగు.. ఏకంగా గ్రామీ అవార్డ్స్‌లో..

Artificial Intelligence Capabilities: మ్యూజిక్ ఇండస్ట్రీలో ఏఐ అడుగు.. ఏకంగా గ్రామీ అవార్డ్స్‌లో..
Advertisement

Artificial Intelligence Capabilities: ఏఐ అనేది గతేడాది మార్కెట్లోకి వచ్చింది. కానీ వచ్చిన కొంతకాలంలోనే అన్ని రంగాల్లో ఏఐ ప్రాముఖ్యత విపరీతంగా పెరిగిపోయింది. అంతే కాకుండా ప్రస్తుతం ఎన్నో రంగాలు దీనిపై పూర్తిగా ఆధారపడి ఉన్నాయి. సైన్స్ అండ్ టెక్నాలజీ, ఏరోనాటిక్స్, రోబోటిక్స్.. ఇలా ప్రతీ రంగంలో ఏఐకు ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పడింది. తాజాగా ఏఐను మ్యూజికల్ ఇండస్ట్రీలో కూడా ప్రవేశపెట్టాలని, దానికి తగిన గుర్తింపు అందజేయాలని ప్రముఖ మ్యూజిక్ కంపెనీ ప్రకటించింది.

గ్రామీ అవార్డ్స్ అనేవి ప్రపంచంలోని ప్రతీ మ్యూజిక్ డైరెక్టర్, సింగర్‌కు ఉండే కల. తమ మ్యూజిక్‌తో గ్రామీ అవార్డ్‌ను దక్కించుకోవాలని ఎంతోమంది కలలు కంటుంటారు. అయితే ఈ గ్రామీ అవార్డ్స్ యాజమాన్యం.. తాజాగా ఏఐ విషయంలో ఒక నిర్ణయానికి వచ్చింది. ఏఐను ఉపయోగించి కంపోజ్ చేసిన మ్యూజిక్‌ను కూడా నామినేషన్స్‌కు పంపించవచ్చని ప్రకటించింది. టెక్నాలజీ విషయంలో అన్ని రంగాలు ముందుకు దూసుకుపోతున్న క్రమంలో మ్యూజిక్ ఇండస్ట్రీ కూడా టెక్నాలజీలను వినియోగించడం అలవాటు చేసుకోవాలని చెప్తోంది.

Advertisement

ఏఐ సాయంతో కంపోజ్ చేసిన మ్యూజిక్‌ను నామినేషన్స్‌కు పంపించవచ్చని చెప్పిన గ్రామీ అవార్డ్స్.. కొన్ని ఆంక్షలు విధించింది. మ్యూజిక్‌ను కంపోజ్ చేసే క్రమంలో కేవలం మనుషుల క్రియేటివిటీని ఉపయోగించాలని రూల్ పెట్టింది. మొత్తంగా ఏఐ మాత్రమే మ్యూజిక్‌ను కంపోజ్ చేసి గ్రామీలో ఎంట్రీ ఉండదని చెప్పింది. మనిషి మ్యూజిక్‌ను క్రియేట్ చేసిన తర్వాత దానిని కంపోజ్ చేసే విషయంలో, ఇన్స్‌ట్రూమెంట్స్‌ను వినియోగించే విషయంలో ఏఐ సామర్థ్యాన్ని ఉపయోగించుకుంటే తమకు ఏ అభ్యంతరం లేదని గ్రామీ అంటోంది.

ఏఐ సాయంతో కంపోజ్ చేసిన మ్యూజిక్‌ను ఏదో ఒక్క కేటగిరిలో మాత్రమే సెలక్ట్ చేస్తామని గ్రామీ రూల్స్‌లో పేర్కొంది. టెక్నాలజీ సాయం తీసుకుంటే మనుషులు ముందుకు వెళ్తే ఓకే కానీ మనిషి క్రియేటివిటీని పక్కన పెట్టి టెక్నాలజీనే అన్ని పనులు చేసేస్తే తమకు ఓకే కాదని తెలిపింది. మ్యూజిక్ లాంటి ఒక ఆర్ట్ విషయంలో మనిషి క్రియేటవిటీనే చాలా ముఖ్యమని గుర్తుచేసింది. అన్ని రూల్స్ మధ్య కూడా ఏఐ లాంటి టెక్నాలజీకి గ్రామీ అవార్డ్స్ సైతం ఛాన్స్ ఇవ్వడం ప్రశంసనీయంగా ఉందని పలువురు శాస్త్రవేత్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×