E-Paper
Advertisement

Bhadrachalam: శ్రీరామనవమికి భద్రాచలం వెళ్తున్నారా..? చుట్టూ ఉన్న అద్భుతాల గురించి తెలుసా

Bhadrachalam: శ్రీరామనవమికి భద్రాచలం వెళ్తున్నారా..? చుట్టూ ఉన్న అద్భుతాల గురించి తెలుసా
Advertisement

Bhadrachalam: శ్రీరామ నవమికి భద్రాచలం వెళ్తున్నారా..? అయితే భద్రాచలంలో రాములోరి గుడి మాత్రమే కాకుండా చుట్టూ అందమైన అద్బుతమైన ప్రదేశాలు, గుడులు ఉన్నాయి. వాటిని కూడా దర్శించి ఆధ్యాత్మిక ప్రపంచంలో పరవశించిపోండి.. ఇంతకీ ఆ అద్భుతాలు ఎక్కడ ఉంటాయన్న  డీటెయిల్స్‌ ఇప్పుడు తెలుసుకుందాం.

భద్రాచలంలో రాముల వారి ప్రధాన ఆలయంతో పాటు ప్రధాన ఆలయానికి  చుట్టుపక్కల రామాయణ గాథతో ముడిపడి ఉన్న కొన్ని అద్భుతమైన, అంతగా ప్రాచుర్యం లేని ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. భద్రాచలం వెళితే వాటిని కూడా చూసి తాదాత్మకమైన ప్రపంచంలో విహరించండి. భద్రాచలంలో ఉన్న అధ్బుతాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

పర్ణశాల (Parnashala): భద్రాచలానికి సుమారు 35 కి.మీ. దూరంలో ఉన్న ఈ ప్రదేశం అత్యంత ముఖ్యమైనది. వనవాస సమయంలో శ్రీరాముడు ఇక్కడే కుటీరం నిర్మించుకుని నివసించారని భక్తులు నమ్ముతారు. ఇక్కడ ముఖ్యంగా సీతమ్మ వారు ఆరవేసుకున్న చీర గుర్తులు (కొండపై రంగులు) కనిపిస్తాయి. అలాగే  రావణుడు సన్యాసి రూపంలో వచ్చిన చోటు ఇక్కడేనని చెప్తుంటారు. అలాగే సీతమ్మ వారిని రావణుడు  అపహరించిన ప్రదేశం కూడా ఇదేనని చెప్తుంటారు.

జటాయు పాక (Yetapaka): భద్రాచలంలోని పర్ణశాలకు సమీపంలోనే ఈ ఏటపాక ఉంటుంది. రావణుడు సీతమ్మను తీసుకెళ్తుంటే.. పక్షి రాజైన జటాయువు అడ్డుకుని యుద్ధం చేసిన ప్రదేశం ఇదే అని చెప్తుంటారు. జటాయువు యొక్క ఒక రెక్క ఇక్కడ తెగిపడిందని చెబుతుంటారు. అందుకే దీనికి ‘ఎటపాక’ అని పేరు వచ్చిందని కథనం.

Advertisement

దుమ్ముగూడెం (Dummugudem): ఇక్కడ శ్రీరాముడు ఖర-దూషణులనే రాక్షసులను సంహరించారని పురాణాలు చెబుతున్నాయి. వేలాది మంది రాక్షసుల సైన్యం ఇక్కడ భస్మమైందని, ఆ బూడిదే ఇప్పటికీ ఇక్కడ మట్టి రూపంలో (దుమ్ము) కనిపిస్తుందని నమ్ముతారు. అందుకే ఈ ఊరికి ‘దుమ్ముగూడెం’ అని పేరు వచ్చిందని చెప్తుంటారు.

ఉష్ణగుండం (Gundala): భద్రాచలానికి సమీపంలో గోదావరి నది ఒడ్డున ఈ వేడి నీటి బుగ్గలు ఉన్నాయి.  ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. చుట్టూ గోదావరి నది నీరు చల్లగా ఉన్నప్పటికీ, ఇక్కడ ఒక చిన్న గుంటలో నీరు మాత్రం ఎప్పుడూ వేడిగా ఉంటుంది. ఆదిశేషుడు తన శ్వాసతో ఈ నీటిని వేడి చేస్తున్నాడని భక్తుల నమ్మకం.

శ్రీ రామగిరి (Sri Ramagiri): ఇది ఒక కొండపై ఉన్న ఆలయం. పర్ణశాలకు వెళ్లే దారిలోనే ఉంటుంది. ఇక్కడ కొండపైన సుందరమైన ప్రకృతి మధ్య రాముడి పాదముద్రలు ఉన్నాయి. ఈ కొండపై నుండి గోదావరి నది ప్రవాహాన్ని చూడటం ఒక అద్భుతమైన అనుభూతిగా చెప్తుంటారు.

అయితే ఈ ప్రదేశాలన్నీ భద్రాచలం నుండి 30-40 కి.మీ. పరిధిలోనే ఉంటాయి. వీటన్నింటినీ సందర్శించాలంటే ఒక రోజంతా సమయం పడుతుంది.

ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ALSO READ: బ్రహ్మంగారి కాలజ్ఞానం – కలియుగం అప్పుడే అంతం అవుతుందట

 

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×