E-Paper
Advertisement

Apples Value Falls: ఆపిల్‌కు షాక్.. రెండేళ్ల కనిష్టానికి కంపెనీ విలువ..

Apples Value Falls: ఆపిల్‌కు షాక్.. రెండేళ్ల కనిష్టానికి కంపెనీ విలువ..
Advertisement

Apples Value Falls: మొబైల్ దిగ్గజ సంస్థ ఆపిల్‌కు మరో షాక్ తగిలింది. కంపెనీ విలువ 2 ట్రిలియన్ డాలర్ల దిగువకు పడిపోయింది. ఏడాది కిందట 3 ట్రిలియన్ డాలర్ల క్యాపిటలైజేషన్ మార్క్ అందుకుని, ఆ ఘనత సాధించిన తొలి కంపెనీగా అవతరించిన ఆపిల్ విలువ… 33 శాతం పతనమై ఇప్పుడు 1.98 ట్రిలియన్ డాలర్లకు చేరింది. 2021 మార్చి తర్వాత ఆపిల్ కంపెనీ విలువ 2 ట్రిలియన్ డాలర్లకన్నా తక్కువకు పడిపోవడం ఇదే తొలిసారి.

ఆపిల్ రేటింగును అవుట్ పెర్మార్మ్ నుంచి తటస్థంగా మార్చిన తర్వాత… కంపెనీ షేరు విలువ 4 శాతం క్షీణించి 124.6 డాలర్లకు చేరింది. ఐఫోన్ అతిపెద్ద తయారీదారు అయిన ఫాక్స్‌కాన్ కంపెనీల్లో ఉత్పత్తి తగ్గిపోవడం, సరఫరాలో సమస్యలు తలెత్తడం వల్ల… ఈ ఏడాది ఐఫోన్ల ఉత్పత్తిని 245 మిలియన్ యూనిట్ల నుంచి 224 మిలియన్ యూనిట్లకు తగ్గించడం కూడా… ఆపిల్ షేరు విలువ పతనం కావడానికి కారణం. ప్రస్తుత స్టాక్ ధర ప్రకారం ఆపిల్ విలువ 1.98 ట్రిలియన్ డాలర్లు. మైక్రోసాఫ్ట్ కన్నా ఆపిల్ విలువ ఇప్పుడు కేవలం 0.2 ట్రిలియన్ డాలర్లు మాత్రమే ఎక్కువగా ఉంది. ప్రస్తుతం మైక్రోసాఫ్ట్ విలువ 1.78 ట్రిలియన్ డాలర్లు.

Advertisement

గ్లోబల్ ఎకానమీలో మందగమనం, అధిక ద్రవ్యోల్బణం… ఆపిల్ ఉత్పత్తుల డిమాండ్‌ను దెబ్బతీస్తాయని భావిస్తున్న ఇన్వెస్టర్లు… కంపెనీ నుంచి తమ పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నారు. అంతేకాదు… మూడో త్రైమాసికతం పోలిస్తే నాలుగో త్రైమాసికంలో ఆపిల్ ఆదాయం ఒక శాతం తగ్గిపోవచ్చనే అంచనా కూడా… ఇన్వెస్టర్లు షేర్లు అమ్ముకోవడానికి మరో కారణం. అయితే 2007 నుంచి ఇప్పటిదాకా ఆపిల్ తన పెట్టుబడిదారులకు లాభాలనే పంచింది. కంపెనీ ఆరంభం నుంచి షేర్లు కలిగి ఉన్నవారికి డివిడెండ్‌లతో సహా 4 వేల శాతం కంటే ఎక్కువ లాభాన్ని అందించింది. అంటే ఒక రూపాయి పెట్టుబడికి రూ.40కి పైగా ఆదాయమన్న మాట.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×