E-Paper
Advertisement

Samsung King : ఆపిలే నెంబర్ 1, శాంసంగే కింగ్!

Samsung King : ఆపిలే నెంబర్ 1, శాంసంగే కింగ్!
Advertisement

Samsung King : దేశంలో దసరా, దీపావళి సీజన్లలో స్మార్ట్ ఫోన్ల అమ్మకాలు ఓ రేంజ్ లో జరిగాయి. ఇందులో ప్రీమియం స్మార్ట్ ఫోన్ సెగ్మెంట్ లో ఆపిల్ తొలిసారి అగ్రస్థానంలో నిలిస్తే… ఏకంగా 99 శాతం వృద్ధితో శాంసంగ్ కూడా కింగ్ అనిపించుకుంది. అనలిటిక్స్ సంస్థ కౌంటర్ పాయింట్ తన తాజా నివేదికలో ఈ వివరాలు పేర్కొంది.

దేశంలో ఈ ఏడాది ఐఫోన్‌ 13 సిరీస్ అమ్మకాలు బాగా జరిగాయి. ఏ రేంజ్ లో అంటే… ప్రీమియం స్మార్ట్‌ఫోన్ల అమ్మకాల్లో నంబర్‌ 1 స్థానం సాధించిన తొలి ఆపిల్ ఫోన్ గా… ఐఫోన్‌ 13 నిలిచింది. మొత్తంగా చూస్తే… ప్రీమియం స్మార్ట్‌ ఫోన్ల విభాగంలో ఆపిల్‌ 40 శాతం మార్కెట్‌ సాధించగా… స్మార్ట్‌ఫోన్‌ విపణిలో 5 శాతం వాటా పొందింది. ఐఫోన్ అమ్మకాల్లో దేశీయంగా ఇదే రికార్డు.

Advertisement

ఇక శాంసంగ్ స్మార్ట్ ఫోన్ల అమ్మకాలు కూడా దుమ్మురేపాయి. సెప్టెంబర్, అక్టోబర్‌ నెలల్లో ఏకంగా రూ.14,400 కోట్ల విలువైన ఫోన్లు అమ్మేశామని శాంసంగ్ ఇండియా తెలిపింది. రూ.30 వేల కంటే ఎక్కువ విలువైన ప్రీమియం ఫోన్ల అమ్మకాల్లో 99 శాతం వృద్ధి సాధించామని ప్రకటించింది. ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్‌ దాకా 5జీ ఫోన్లు రికార్డు స్థాయిలో జరిగాయని, 2021తో పోలిస్తే కంపెనీ వ్యాపారం మొత్తం 20 శాతం వృద్ధి చెందిందని వెల్లడించింది.

మరోవైపు… ప్రతీ ఏడాది లాగే ఈసారి కూడా చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం షావోమీ… స్మార్ట్ ఫోన్ అమ్మకాల్లో తొలిస్థానంలో నిలిచింది. ఇక వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్ల అమ్మకాలు థర్డ్ క్వార్టర్లో 35 శాతం పెరిగాయి. ప్రీమియం స్మార్ట్ ఫోన్ అమ్మకాల్లో వన్ ప్లస్ మూడో స్థానంలో నిలిచింది.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×