E-Paper
Advertisement

Apple Business Strategy : కొత్త కేక, పాత రోత.. ఐఫోన్లపై స్ట్రాటజీ.. ఇక ఆ ఫోన్లు చూడలేం

Apple Business Strategy : కొత్త కేక, పాత రోత.. ఐఫోన్లపై స్ట్రాటజీ.. ఇక ఆ ఫోన్లు చూడలేం
Advertisement
Apple Business Strategy

Apple Business Strategy : ఇప్పుడు మారుతి సుజుకి ఓ కొత్త మోడల్‌ను విడుదల చేసిందనుకోండి.. అంతకు ముందు నెల రిలీజ్ చేసిన మోడల్ ప్రొడక్షన్‌ను ఆపేస్తుందా చెప్పండి. లేదు కదా. కాని, యాపిల్ మాత్రం ఆపేస్తానంటోంది. కొత్త వర్షన్స్, కొత్త మోడల్స్ వస్తున్నప్పుడు.. మళ్లీ పాత ఐఫోన్‌ను కొనేవాళ్లు ఎవరు అనే క్వశ్చన్ వేయొచ్చు. కాని, పాత మోడల్స్ కు కూడా ఇప్పటికీ మంచి క్రేజ్ ఉంది. అయినప్పటికీ.. ఐఫోన్ ఓల్డ్ మోడల్స్‌ను ఉత్పత్తి చేయకూడదు అనుకుంటోంది యాపిల్. ఇప్పటి వరకు అఫీషియల్ స్టేట్‌మెంట్ అయితే రాలేదనుకోండి. కాని, ఇలా చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

కొత్త మోడల్స్ రిలీజ్ చేస్తున్నప్పుడు.. పాత మోడల్స్‌ను అలాగే ఉత్పత్తి చేయడం దేనికనేది యాపిల్ వేస్తున్న ప్రశ్న. నిజమే కదా.. పాత మోడల్ ధరలు ఎంతైనా తక్కువగా ఉంటాయి. అదే కొత్త మోడల్ అయితే ధర ఎక్కువగా ఉంటుంది. పైగా యాపిల్ ఐఫోన్లకు ఉన్న క్రేజ్ కారణంగా ఎంతైనా పెట్టి కొంటారు. అలాంటప్పుడు.. కొత్త ఐఫోన్‌కే కస్టమర్లను అలవాటు చేయాలనుకుంటుంది తప్ప పాత ఫోన్ల వైపు వెళ్లాలని కోరుకోదు. యాపిల్ స్ట్రాటజీ ఇదే. అందుకే, ఓల్డ్ మోడల్స్ ప్రొడక్షన్‌ను ఆపేయబోతోందనే వార్తలు వినిపిస్తున్నాయి.

Advertisement

మరికొన్ని నెలల్లోనే.. యాపిల్ ఐఫోన్ 15 సిరీస్ లాంచ్ కాబోతోంది.
ఈ కొత్త మోడల్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ఫీచర్స్ ఏంటన్న విషయంపై ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అయితే, ఐఫోన్ 14లానే ఐఫోన్ 15లోనూ నాలుగు మోడల్స్ ఉండే ఛాన్స్ ఉందని వస్తున్న లీక్స్ ఆధారంగా తెలుస్తోంది. వనీలా ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్, ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ లేదా అల్ట్రా మోడళ్లు ఉండే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది.

ఐఫోన్ 15 లాంచ్ తరువాత.. కొన్ని పాత మోడళ్ల ఉత్పత్తిని ఆపేయాలని యాపిల్ అనుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి.  ఐఫోన్ 15 తర్వాత మార్కెట్లో ఉన్న కనీసం నాలుగు మోడళ్లను ఆపేయాలన్నది యాపిల్ ఆలోచనగా ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. ఇందులో ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్, ఐఫోన్ 12, ఐఫోన్ 13 మినీలు ఉన్నట్టు అంచనా.

Advertisement

గతేడాది ఐఫోన్ 14 సిరీస్‌ రిలీజ్ తర్వాత కొన్ని పాత జనరేషన్ ఫోన్లను తొలగించింది యాపిల్. ఐఫోన్ 11, ఐఫోన్ 12 మినీలను కూడా అమ్మకాల నుంచి తప్పించింది. ఇప్పుడు కూడా అదే జరగొచ్చు అంటున్నారు.

ఇక భారత్‌లో అడుగుపెట్టి 25 ఏళ్లు అయిన సందర్భంగా ఏప్రిల్‌ 18న యాపిల్‌ తన మొదటి స్టోర్‌ను ముంబయిలో ప్రారంభించనుంది. ఏప్రిల్‌ 20న ఢిల్లీలో రెండో స్టోర్‌ తెరిచేందుకు రెడీ అవుతోంది. ఈ కార్యక్రమానికి యాపిల్‌ సీఈఓ టిమ్‌ కుక్‌ హాజరు కానున్నారు. 

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×