E-Paper
Advertisement

Google : గూగుల్‌కు మరోసారి షాక్!

Google : గూగుల్‌కు మరోసారి షాక్!
Advertisement

Google : భారత్ లో గూగుల్‌కు షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. 1337.76 కోట్ల జరిమానా విధించి నాలుగు రోజులు గడవక ముందే… మరోసారి 936.44 కోట్ల జరిమానా విధించింది… కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా- CCI.మార్కెట్‌లో గూగుల్‌ తన ఆధిపత్యాన్ని దుర్వినియోగం చేయడంతో పాటు… ప్లే స్టోర్‌ పాలసీ నిబంధనల్ని తుంగలో తొక్కుతోందని… పేమెంట్‌ యాప్స్‌, అండ్‌ పేమెంట్‌ సిస్టంను ప్రమోట్‌ చేస‍్తుందని CCI ట్వీట్‌ చేసింది. ఇందుకు గానూ గూగుల్‌కు 936.44 కోట్ల ఫైన్ విధిస్తున్నట్లు ఆ ట్వీట్‌లో పేర్కొంది. మొత్తానికి నాలుగు రోజుల వ్యవధిలో గూగుల్ కు 2,274 కోట్ల రూపాయలకు పైగా జరిమానా విధించింది… CCI.మార్కెట్‌ గుత్తాధిపత్యాన్ని దుర్వినియోగం చేస్తున్న గూగుల్… తన పద్ధతి మార్చుకోవాలని CCI సూచించింది.

ఒక యాప్ ను అభివృద్ధి చేసిన డెవలపర్… అది యూజర్లకు చేర్చాలంటే యాప్ స్టోర్ పైనే ఆధార పడాలి. మన దేశంలో ఎక్కువగా వాడుతున్నవి ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లే. దీంతో యాప్‌ డెవలపర్లు తమ యాప్ ను యూజర్లకు అందుబాటులోకి తీసుకురావాలంటే… గూగుల్ ప్లే స్టోర్‌ మీద ఆధార పడటం తప్ప వేరే దారి లేదు. ప్లే స్టోర్‌లో యాప్‌ లిస్ట్‌ చేయాలంటే గూగుల్‌ రూల్స్ కు తలొగ్గడంతో పాటు… గూగుల్ ప్లే బిల్లింగ్‌ సిస్టమ్‌ను అనుసరించాలి. ఇది గుత్తాధిపత్యాన్ని దుర్వినినయోగం చేయడమేనని భావించిన CCI… గూగుల్ కు భారీగా జరిమానా వడ్డించింది.

Advertisement

తొలిసారి భారీ జరిమానా విధించినప్పుడే స్పందించిన గూగుల్… కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిర్ణయం భారత కస్టమర్లు, వ్యాపారులకు పెద్ద ఎదురు దెబ్బ అని వ్యాఖ్యానించింది. దీని వల్ల వినియోగదారులపై అదనపు భారం పడుతుందని చెప్పుకొచ్చింది.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×