E-Paper
Advertisement

Sekhar Basha : మరో వివాదంలో ఆర్జే శేఖర్ బాషా .. సైబర్ క్రైమ్ లో కంప్లైంట్..

Sekhar Basha : మరో వివాదంలో ఆర్జే శేఖర్ బాషా .. సైబర్ క్రైమ్ లో కంప్లైంట్..
Advertisement

Sekhar Basha : టాలీవుడ్ లో సంచలనం రేపిన రాజ్ తరుణ్ – లావణ్య ల కేసు ఇప్పటికి ఒక కొలిక్కి రాలేదు . ఈ కేసు ఎన్నో మలుపులు తిరిగిన సంగతి తెలిసిందే . చివరకు రాజ్ తరుణ్ దే తప్పు అని పోలీసుల విచారణలో తేలింది . అయితే ఈ కేసులో ఆర్జే శేఖర్ బాషా కూడా ఇన్వాల్వ్ అయిన సంగతి తెలిసిందే. వీరిద్దరి మధ్య జరిగింది ఇదే అంటూ ఆ మధ్య పలు ఛానెల్స్ కు ఇంటర్వ్యూ లు కూడా ఇచ్చారు . ఆయన ఇంటర్వ్యూ లు ఎంత దుమారం రేపాయో మనం చూసాము. ఇప్పుడు మరో వివాదంలో చిక్కుకున్నాడని తెలుస్తుంది. తాజాగా ఆయనను సైబర్ క్రైం పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారని ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. పోలీసులు శేఖర్ ను ఎందుకు అదుపులోకి తీసుకున్నారో కాస్త వివరంగా తెలుసుకుందాం..

బిగ్ FM లో ఆర్జేగా పనిచేసే శేఖర్ బాషా ఇటీవల రాజ్ తరుణ్ – లావణ్య వివాదంలో రాజ్ తరుణ్ కి సపోర్ట్ గా మాట్లాడి ఫేమస్ అయ్యాడు. ఆ ఇష్యూలో రాజ్ తరుణ్ తరపున మీడియా ముందు మాట్లాడి, ఇంటర్వ్యూలు ఇచ్చి వైరల్ అయ్యాడు. ఇప్పుడు మరో ఇష్యులో ఆయన పేరు వినిపిస్తుంది. సామాజిక మాధ్యమాల్లో తనపై ట్రోలింగ్​ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ప్రముఖ యూట్యూబర్​ హర్షసాయి బాధితురాలు సైబరాబాద్​ సైబర్​ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. అత్యాచార బాధితురాలైన తనపై హర్షసాయి ఉద్దేశపూర్వకంగా ట్రోలింగ్​ చేయిస్తున్నాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారు. తనపై ఈ విధంగా సామాజిక మాధ్యమాల్లో ట్రోలింగ్​ చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. ఇక తనపై జరుగుతున్న ట్రోలింగ్​పై పలు స్క్రీన్​ షాట్లను పోలీసులకు సమర్పించారు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల అదే బాధితురాలు హర్షసాయి తనపై లైంగిక దాడికి పాల్పడి, బెదిరింపులకు దిగుతున్నాడని నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసు విచారణలో ఉండగానే మరో వార్త సంచలనంగా మారింది.

Advertisement

తాజాగా ఈ కేసులో ఆర్జే శేఖర్ బాషా పేరు వినిపిస్తుంది. హర్ష సాయి బాధితురాలు ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా శేఖర్ భాషాని అదుపులోకి తీసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు , మూడు గంటల గా సైబర్ క్రైమ్ ఆఫీస్ లో ఆర్జె శేఖర్ భాషను ప్రశ్నిస్తున్నారు . ఇక బాధితురాలికి సంబంధించిన నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నందుకు , కొన్ని యూట్యూబ్ ఛానల్ లో ఆమెపై అసత్య ప్రచారాలు చేసినందుకు శేఖర్ భాషా పై సైబర్ క్రైమ్ లో కంప్లైంట్ చేసింది హర్ష సాయి బాధితురాలు.. ఇక శేఖర్ భాషా ఇటీవల తెలుగు టాప్ రిలియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 8 లో పాల్గొన్నారు . వివాదాలతో వైరల్ అయినంతగా హౌస్ లో ఆకట్టుకోలేక పోయాడు . దాంతో రెండో వారంలోనే ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చాడు. ఇక ఇప్పుడు మరో కేసులో ఇరుక్కున్నాడని తెలుస్తుంది. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×