E-Paper
Advertisement

ఫోన్ స్టోరేజ్ ఊరికే నిండిపోతోందా? ఫోటోలు, వీడియోలు డిలీట్ చేయకుండానే.. స్టోరేజ్ పెంచుకోవచ్చు!

ఫోన్ స్టోరేజ్ ఊరికే నిండిపోతోందా? ఫోటోలు, వీడియోలు డిలీట్ చేయకుండానే.. స్టోరేజ్ పెంచుకోవచ్చు!
Advertisement

Android Storage Tips: ఆండ్రాయిడ్ మెుబైల్ యూజర్లను సాధారణంగా వెంటాడే సమస్యల్లో స్టోరేజ్ ఒకటి. అధిక స్టోరేజ్ ఉన్న స్మార్ట్ ఫోన్ తీసుకున్నప్పటికీ.. నాణ్యమైన ఫొటోలు, వీడియోలు, గేమింగ్ యాప్స్, సినిమాలు డౌన్ లోడ్ చేయడం ద్వారా వెంటనే ఫోన్ స్టోరేజ్ ఫుల్ అయిపోతూ ఉంటుంది. దీనిని తిరిగి పొందే క్రమంలో కొందరు ఫొటోలు, వీడియోలను సైతం డిలీట్ చేస్తుంటారు. అయితే ఇవేమి చేయకుండానే హిడెన్ సిట్టింగ్స్ ద్వారా స్పేస్ ను పెంచుకోవచ్చు. ఆండ్రాయిడ్ 16 లేదా లేటెస్ట్ వెర్షన్స్ ఫోన్స్ లో స్టోరేజ్ సమస్యకు చెక్ పెట్టే ఈజీ టిప్స్ ను ఇప్పుడు పరిశీలించండి.

యాప్ కాష్ క్లియర్

మనం వాడే ప్రతి యాప్ కొంత టెంపరరీ డేటాను స్టోర్ చేస్తూ ఉంటుంది. ఇది కాలక్రమేణా GBల కొద్దీ స్టోరేజ్‌ను ఆక్రమిస్తుంది. కాబట్టి యాప్ కాష్ (Cache) క్లియర్ చేయడం ద్వారా స్టోరేజీని ఫ్రీ చేసుకోవచ్చు. ఇందుకోసం ఫోన్ సెట్టింగ్స్ లోకి వెళ్లి స్టోరేజ్ పై క్లిక్ చేయాలి. అక్కడ యాప్స్ లోకి వెళ్లి ప్రతీ యాప్ ఓపెన్ చేసి.. ‘Clear Cache’ పై క్లిక్ చేయండి.

స్మార్ట్ స్టోరేజ్ ఆన్ చేయండి

Advertisement

గూగుల్ ఫోన్లలో ఈ ఫీచర్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది బ్యాకప్ అయిన పాత ఫోటోలు, వీడియోలను ఫోన్ నుండి ఆటోమేటిక్‌గా డిలీట్ చేస్తుంది. ఇందుకోసం సెట్టింగ్స్ లోకి వెళ్లి స్టోరేజ్ పై క్లిక్ చేయాలి. అక్కడ ఉన్న ‘Smart Storage’ ఆప్షన్‌ను ఎనేబుల్ చేస్తే సరిపోతుంది.

వాట్సాప్ స్టోరేజ్ మేనేజ్‌మెంట్

ఫోన్ స్టోరేజ్ నిండటానికి గల ప్రధాన కారణాల్లో వాట్సప్ ఒకటి. అలాగే మెసెంజర్, టెలిగ్రామ్ వంటి యాప్స్ సైతం పెద్ద ఎత్తున డేటాను స్టోరేజ్ లో పడేస్తుంటాయి. కాబట్టి ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు ఇలా చేయండి. ముందుగా ఫోన్ లోని File Managerలోకి వెళ్లండి. అక్కడ Internal Storageపై క్లిక్ చేసి Android > Media ఫోల్డర్‌లోకి వెళ్లండి. అక్కడ వాట్సాప్ లేదా టెలిగ్రామ్ ఫోల్డర్లలో ఉండే అనవసరమైన డేటాను డిలీట్ చేస్తే.. 5GB నుంచి 10GB వరకు స్పేస్ లభిస్తుంది.

ఆఫ్‌లైన్ మ్యాప్స్, డౌన్‌లోడ్స్

Advertisement

మీరు ఎప్పుడో డౌన్‌లోడ్ చేసిన ‘ఆఫ్ లైన్ మ్యాప్స్’ (Offline Maps) సైతం ఫోన్ మెమరీని వాడుతుంటాయి. కాబట్టి గూగుల్ మ్యాప్స్ యాప్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి వాటిని డిలీట్ చేయండి. అలాగే నెట్‌ఫ్లిక్స్, యూట్యూబ్‌లో డౌన్‌లోడ్ చేసిన వీడియోలు ఆఫ్ లైన్ సెక్షన్‌లో ఉండిపోతాయి. వాటిని ఎప్పటికప్పుడు క్లియర్ చేయడం ద్వారా స్టోరేజ్ సమస్య నుంచి బయటపడొచ్చు.

Also Read: విజయ్ ర్యాలీలో బాంబు కలకలం.. సైకిల్ వదిలి నటుడు పరుగో పరుగు!

మీడియా స్టోరేజ్ టిప్స్

కొన్నిసార్లు ఫోన్ మెమరీ ఖాళీగా ఉన్నా ‘స్టోరేజ్ ఫుల్’ అని పదే పదే చూపిస్తుంటాయి. ఈ సమస్య నుంచి బయటపడేందుకు ముందుగా ఫోన్ లో సెట్టింగ్స్ ఓపెన్ చేయండి అక్కడ యాప్స్ > షో సిస్టమ్ యాప్స్ క్లిక్ చేయండి. అనంతరం మీడియా స్టోరేజ్ అనే ఐకాన్ ను వెతికి.. క్లియర్ డేటా, కాష్ చేయండి. ఆ తర్వాత ఫోన్‌ను ఒక్కసారి రీస్టార్ట్ చేస్తే చాలా వరకూ స్టోరేజ్ తిరిగి వస్తుంది.

Also Read: ఎయిర్‌టెల్ క్రేజీ ప్లాన్.. అపరిమిత 5G డేటా, ఫ్రీ హాట్‌స్టార్.. ఎన్నో మరెన్నో బెన్‌ఫిట్స్!

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×