E-Paper
Advertisement

Air Force:-ఎయిర్ ఫోర్స్ బేస్‌పై అమెరికా భారీ పెట్టుబడి..

Air Force:-ఎయిర్ ఫోర్స్ బేస్‌పై అమెరికా భారీ పెట్టుబడి..
Advertisement

Air Force:-అభివృద్ధి అంటే వర్తమానంలో బ్రతకడం కంటే భవిష్యత్తు గురించి ఆలోచించడం అని శాస్త్రవేత్తలు భావిస్తున్నారో ఏమో.. ఫ్యూచర్‌కు ఉపయోగపడే ఎన్నో వనరులను తయారు చేస్తూ, సేకరిస్తూ బిజీగా ఉండిపోతున్నారు. ఒక్క దేశంలో కాదు.. ప్రతీ ప్రపంచ దేశంలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఇక అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశమైతే.. అన్నింటికంటే ముందుండాలి అనుకుంటోంది. అందుకే ఓ ప్రాజెక్ట్‌ను మొదలుపెట్టనుంది.

అమెరికాకు సంబంధించిన ఆర్మీ ఇంజనీర్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ (ఈఆర్డీసీ), టిండల్ ఎయిర్ ఫోర్స్ బేస్‌తో ఒక మల్టీ బిలియన్ డాలర్ ప్రాజెక్ట్ కోసం ఒప్పందం చేసుకుంది. ఇది టిండల్ ఎయిర్ ఫోర్స్ బేస్‌కు రీకన్‌స్ట్రక్షన్ ప్రాజెక్ట్ అని తెలుస్తోంది. మరింత స్మార్ట్‌గా, ఎక్కువ సామర్థ్యంతో ‘ఇన్‌స్టాలేషన్ ఆఫ్ ఫ్యూచర్’ పేరుతో ఈ ప్రాజెక్ట్ ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన టెక్నాకల్ బాధ్యతలు ఒక సీనియర్ ఆఫీసర్‌కు అప్పగించారు.

Advertisement

ఇప్పటికే ఈఆర్డీసీ ఒక డిజిటల్ ట్విన్ టెక్నాలజీని ఉపయోగించి టిండల్ ఎయిర్ ఫోర్స్ బేస్‌కు వర్చువల రెప్లికాను తయారుచేసింది. ఇప్పుడు ఉన్న బేస్‌ను మార్చే దానిని మరింత మోడర్న్‌గా, మరింత టెక్నికల్‌గా తయారు చేయడానికి ఈ వర్చువల రెప్లికా ఉపయోగపడనుంది. దానికి తగిన ప్లాన్‌ను ఈ రెప్లికాలో వివరంగా చూపించారు. బేస్ క్యాంప్ ఎలా ఉంటుందో ఈ వర్చువల్ రెప్లికాను స్వయంగా అనుభూతి చెందవచ్చు. పలువురు దీనిని అనుభూతి చెందిన తర్వాత వారి రివ్యూలను బట్టి ఈ ప్లాన్‌లో మార్పులు జరగనున్నాయి.

ఈ ఎయిర్ బేస్ క్యాంప్ పూర్తిగా ఆర్మీ ఉద్యోగులకు ఉపయోగపడే విధంగా మార్చబడనుంది. దీనికోసం ఎన్ని డాలర్లు ఖర్చు పెట్టడానికి అయినా అమెరికా సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. కేవలం ఈ ఎయిర్ బేస్ క్యాంప్ మాత్రమే కాకుండా ఈఆర్డీసీ ఆధ్వర్యంలో ఉండే కన్‌స్ట్రక్షన్ ఇంజనీరింగ్ అండ్ రీసెర్చ్ లేబురేటరీ, ఎన్విరాన్మెంటల్ లేబురేటరీ అండ్ కోస్టల్ అండ్ హైడ్రాలిక్స్ లేబురేటరీ వంటి వాటికి కూడా ట్విన్ టెక్నాలజీతో పరిశోధనలు చేయాలని సన్నాహాలు చేస్తోంది.

Advertisement

మీడియా ఉద్యోగాలకు ఏఐ ముప్పు..

for more updates follow this link:-bigtv

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×