E-Paper
Advertisement

Space Weather: స్పేస్‌లో వాతావరణాన్ని గ్రహించే కృత్రిమ మేధస్సు.

Space Weather: స్పేస్‌లో వాతావరణాన్ని గ్రహించే కృత్రిమ మేధస్సు.
Advertisement
Space Weather

కృత్రిమ మేధస్సు (ఏఐ) ఇప్పటికే ఎన్నో రంగాల్లో శాస్త్రవేత్తలకు సహాయపడుతోంది. ఎన్నో పరిశోధనల్లో కూడా ఈ కృత్రిమ మేధస్సు వారికి తగిన సాయాన్ని అందిస్తోంది. తాజాగా కృత్రిమ మేధస్సు సాయంతో పరిశోధనలను భూమి నుండి ఆకాశంపైకి తీసుకువెళ్లాలని శాస్త్రవేత్తలు అనుకుంటున్నారు. ఈ విభాగంలో ఓ ఫిజిసిస్ట్‌కు అమెరికా ప్రభుత్వం తరపున ఆర్థిక సాయం కూడా అందింది.

అంతరిక్షంలో జరిగే మార్పులను బట్టి భూమిపై వాతావరణంతో పాటు పలు ఇతర విషయాల్లో కూడా మార్పులు వస్తుంటాయి. అందుకే శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడు స్పేస్ గురించి స్టడీ చేస్తుంటారు. అందులో భాగంగానే శాటిలైట్లను, స్పేస్ మిషిన్లను ఆకాశంలోకి పంపిస్తుంటారు. త్వరలోనే ఈ ప్రక్రియ మారనుంది. వాటి స్థానంలోకి కృత్రిమ మేధస్సు వచ్చి చేరనుంది. ఇప్పటికే స్పేస్‌లోకి ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్‌ను పంపించే ప్రయత్నం చేసి సక్సెస్ అయిన శాస్త్రవేత్తలు.. ఈ పరిశోధనల్లో వేగం పెంచాలని ఆలోచిస్తున్నారు.

Advertisement

సూర్యుడి చుట్టూ జరిగే కదలికలు కూడా భూమిపై ఉండే కమ్యూనికేషన్ సిస్టమ్‌ను ప్రభావితం చేస్తాయి. ప్రస్తుతం ప్రతీ ఒక్కరు టెక్నాలజీపై విపరీతంగా ఆధారపడి ఉన్నారు. అందుకే సోలార్ స్టార్మ్స్ లాంటివి టెక్నాలజీకి ఊహించని నష్టాన్ని తెచ్చిపెట్టే అవకాశం ఉంది. కానీ ఈ సోలార్ స్టార్మ్స్ ఎప్పుడు, ఏ రూపంలో వస్తాయో చెప్పలేం. ఈ సోలార్ స్టార్మ్స్‌ను ప్రత్యేకంగా స్టడీ చేయడానికి ఓ కృత్రిమ మేధస్సు ఏర్పాటు కానుంది.

ఈ సోలార్ స్టార్మ్ కేవలం భూమిపైనే కాదు స్పేస్ వాతావరణంపై కూడా తీవ్ర ప్రభావం చూపిస్తాయి. అందుకే కృత్రిమ మేధస్సు ద్వారా స్పేస్‌లోని వాతావరణాన్ని గమనిస్తూ, స్పేస్ స్టార్మ్‌ను వెంటనే గుర్తించే ప్రయత్నం చేస్తుంది. గత 20 ఏళ్లుగా శాటిలైట్లు, స్పేస్ మిషిన్ల ద్వారా ఈ స్పేస్ స్టార్మ్స్‌ను గుర్తిస్తూ వస్తున్నారు. కానీ వాటికంటే కృత్రిమ మేధస్సు మరింత ఖచ్చితమైన సమాచారం ఇవ్వనుందని ఈ విభాగంలో పనిచేయనున్న శాస్త్రవేత్తలు హామీ ఇస్తున్నారు.

Advertisement

హఠాత్తుగా స్పేస్ స్టార్మ్ వచ్చినప్పుడు అది విద్యుత్తుకు, నెట్‌వర్క్‌కు మాత్రమే కాదు భూమిలో ఉన్న పైప్‌లైన్స్‌కు కూడా నష్టం కలిగిస్తుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. దీని వల్ల కరెంటు పోవడంలాంటి సమస్యలతో పాటు ట్రాన్స్‌ఫార్మర్లు పేలిపోయే అవకాశం కూడా ఉందని వారు హెచ్చరిస్తున్నారు. అందుకే స్పేస్ స్టార్మ్‌ను గుర్తించడం ముఖ్యమైన విషయమని, దానికి కృత్రిమ మేధస్సు ఎంతో సహాయపడనుందని వారు హామీ ఇస్తున్నారు.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×